pebberu

Municipal Chairman and Vice-Chairman perform the ground-breaking ceremony (bhumi puja) for the construction of an 'Indiramma' house.

Municipal Chairman and Vice-Chairman perform the ground-breaking ceremony (bhumi puja) for the construction of an 'Indiramma' house.

By ·

Share this article
Municipal Chairman and Vice-Chairman perform the ground-breaking ceremony (bhumi puja) for the construction of an 'Indiramma' house.

 

 

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మెన్ వైస్ చైర్మన్ 


టీ మీడియా, నవంబర్ 18, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ లోనీ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు  పెబ్బేరు మున్సిపాలిటీలోని 5వ వార్డుకు చెందిన గోపిగారి సుజాత భర్త  కుక్కన్న దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి 5వ వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి శివతో కలిసి భూమి పూజ చేశారు అనంతరం మున్సిపల్  చైర్మన్ మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో ఊరట లభిస్తుందని నాణ్యతా ప్రమాణాలతో గృహాలను నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు ఈ కార్యక్రమంలోవార్డు కౌన్సిలర్ దాసరి జమ్ములమ్మ వార్డు అధికారులు మహేష్ మిథున్ వార్డు నాయకులు టి రాములు టి కృష్ణయ్య, జి రాములు జి పరశురామ్ కె అర్జున్ పి అరవింద్ దాసరి రాములు పి సునీల్ రెడ్డి జగన్ వార్డు ప్రజలు పాల్గొన్నారు

Tags: