హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మెన్
టీ మీడియా,నవంబర్ 13, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని (బీసి హాస్టల్)ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ చైర్మెన్ కాంగ్రెస్ నేతల బృందం వసతి గృహంలో విద్యార్థుల వసతి భోజన సదుపాయాలు మౌలిక వసతులు ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం షూస్ కాస్మొటిక్ వస్తువులు అందించార అనీ వాటిని వినియోగించుకోవాలని శ్రద్ధగా చదువుకోవాలని ఉన్నత ఉద్యోగ స్థాయికి ఎదగాలని తల్లి తండ్రులకు కీర్తి ప్రతిష్ఠ లు తేవాలని అన్నారు హాస్టల్ వార్డెన్ సమయ పాలన పాటించాలని విద్యార్థులకు మంచి రుచి కరమైన భోజనం వసతులు ఎర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు దయాకర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు






