hyderabad

Weightage for marks to be reintroduced in EAPCET Government considering a 20% weightage!

Weightage for marks to be reintroduced in EAPCET Government considering a 20% weightage!

By ·

Share this article
Weightage for marks to be reintroduced in EAPCET  Government considering a 20% weightage!

 

 

ఎప్‌సెట్‌లో మళ్లీ మార్కుల వెయిటేజి                                                                       

 20 శాతం ఇవ్వాలనే యోచనలో సర్కార్!
     

టీమీడియా , నవంబర్ 18,  హైదరాబాద్​  బ్యూరో : తెలంగాణలో 2019 వరకు ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ)లో అమలైన ఇంటర్మీడియట్‌ మార్కుల వెయిటేజిని మళ్లీ అమలు చేయాలని విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. ఇంటర్‌లోని భాషా సబ్జెక్టులను మినహాయించి మిగిలిన 600 మార్కులకు 25 శాతం మార్కుల వెయిటేజి ఉండగా, 2020 లో తాత్కాలికంగా దాన్ని తొలగించారు. కేవలం ఎప్‌సెట్‌ మార్కుల (నాడు ఎంసెట్‌)ను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. తర్వాత రెండేళ్లపాటు పొడిగించి 2023లో శాశ్వతంగా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించిన విషయం తెలిసిందే.

ప్రైవేట్‌ కళాశాలల అభ్యర్థులకే లబ్ధి
పలు రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్‌ రాస్తుండటం, కొందరు గ్రేడ్లలో మార్కులివ్వడం, సీబీఎస్‌ఈ లాంటివి ఆలస్యంగా మార్కులు వెల్లడిస్తుండటం, ఇంటర్‌ మార్కులకు వెయిటేజి వల్ల ప్రైవేట్‌ కళాశాలల అభ్యర్థులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకొని వెయిటేజిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీఓను జారీ చేసింది. కానీ ఇప్పుడు 11, 12 తరగతుల మార్కులకు 20 శాతం వెయిటేజి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో కేరళం, మరికొన్ని రాష్ట్రాల్లో అధ్యయనం
నీట్‌ పరీక్షల సంస్కరణల కోసం సాఫ్ట్​వేర్​ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని ఛైర్మన్‌గా కేంద్రం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను స్వీకరించేందుకు తాజాగా కొందరు టాస్క్‌ఫోర్స్‌ మెంబర్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు, విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో కేరళం ప్రభుత్వం 12వ తరగతికి 50 శాతం వెయిటేజితో ర్యాంకులు కేటాయిస్తుందని, దాన్ని అనుసరించడం మంచిదని వారు రాష్ట్ర అధికారులకు సూచనలు చేశారు.

కేరళంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో
తెలంగాణ విద్యాశాఖ అదనపు సెక్రటరీ వాంకుడోతు సైదా నేతృత్వంలో త్వరలో కేరళంతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బృందం పర్యటించనుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇంటర్‌ను రద్దు చేసి, దాని స్థానంలో సీబీఎస్‌ఈ తరహాలో 12వ తరగతి విధానం(సీనియర్‌ సెకండరీ) అమలు చేస్తామని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Tags: