andrapredesh

Rs.7 crore scam in the name of jobs APPSC database change exposed Video, WhatsApp chat

Rs.7 crore scam in the name of jobs APPSC database change exposed Video, WhatsApp chat

By ·

Share this article
Rs.7 crore scam in the name of jobs  APPSC database change exposed  Video, WhatsApp chat

 

 

ఉద్యోగాల పేరిట రూ.7 కోట్ల కుంభకోణం                                                           

 వెలుగులోకి ఏపీపీఎస్సీ డేటాబేస్ మార్పు                                                   

వీడియో, వాట్సాప్ చాట్స్
 


టీమీడియా , నవంబర్ 18, అమరావతి  బ్యూరో :  పోలీసు, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి రూ.7 కోట్లు వసూలు చేసిన భారీ కుంభకోణం కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. సుమారు 36 మంది నిరుద్యోగులను ఏమార్చిన ప్రధాన నిందితులు ధరణి కృష్ణ, నిమ్మకాయల పెద్దిరాజుల మోసాలపై పోలీసులు పక్కా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ మోసాలకు సంబంధించిన ఓ వీడియో, నిరుద్యోగులతో జరిపిన వాట్సప్‌ చాటింగ్‌లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ధరణి కృష్ణ గతంలో చేసిన ఇతర మోసాల గురించి కూడా ఆమె బంధువులు పోలీసులకు వివరించినట్టు తెలిసింది.

ఎగ్జామ్ రాయలేదనడానికి వీల్లేదంటూ                                                                                                              "ఏపీపీఎస్సీ బోర్డు డేటాబేస్‌లో మార్పులు చేస్తే పనిచేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. రేపు ఎవరైనా చెక్‌ చేసినా డేటాబేస్‌లో మీ వివరాలే వస్తాయి. మీరెవరూ ఎగ్జామ్‌ రాయలేదనడానికి అస్సలు వీల్లేదు. డిప్యూటీ కమిషనర్‌ జులై 15లోపు సంతకాలు పెడతారు. ఏపీపీఎస్సీలో ఇప్పటికే సగం మందికి పైగా వివరాలు నమోదయ్యాయి. జులై ముగిసేలోపు మీకు జాయినింగ్‌ ఆర్డర్‌ ఇస్తాం. ఇక్కడినుంచి ఇప్పుడు నేను ఏపీపీఎస్సీ బోర్డుకు వెళ్లాలి' అని ధరణికృష్ణ ఆ వీడియోలో చెబుతూ అక్కడినుంచి వెళ్లిపోయారు.

దేవాదాయ శాఖలో ఉద్యోగాలిప్పిస్తామని ధరణికృష్ణ ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్టు తాజాగా లీకైన వాట్సప్ చాటింగ్‌ల ద్వారా తెలిసింది. "11 నెలల కిందట నేను మీకు రూ.22 లక్షలు ఇచ్చాను. వాటికి వడ్డీ రూ.4.84 లక్షలు, ఫైల్‌ ప్రాసెస్‌ ఫీజు రూ.13 వేలు కలిపి మొత్తం రూ.26.79 లక్షలు నాకు వెనక్కి ఇవ్వాలి" అని ఓ బాధితుడు ధరణికృష్ణకు వాట్సప్‌లో సందేశం పంపారు. దీనికి బదులుగా తనకు కేవలం రూ.7 లక్షలు మాత్రమే అందాయని, మిగిలిన సొమ్ముతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ఇలాంటి కీలక వాట్సప్ చాటింగ్‌లను పోలీసులు గుర్తించి ఆధారాలుగా సేకరించారు.

పోలీసుల అదుపులో నిమ్మకాయల పెద్దిరాజు?                                                                                                ఈ భారీ కుంభకోణంలో మరో కీలక నిందితుడైన నిమ్మకాయల పెద్దిరాజును పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.7 కోట్లు వసూలు చేసి, తమ పేరును దుర్వినియోగం చేశారని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కల్యాణం శివశ్రీనివాసరావు, కైరెన్‌ కన్సల్టెన్సీ సీఈవో కోట రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, కోర్టులో లొంగిపోవడానికి పెద్దిరాజు తన మనుషులను ముందుగా కోర్టు వద్దకు పంపారు. అక్కడ పోలీసులు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే ఆయన కోర్టుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ పక్కా సమాచారంతో పోలీసులు అతడిని తాడేపల్లి సమీపంలోనే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Tags: