Hyderabad

Betting money sent from Hyderabad to China Rs 2,700 crore transferred in the form of crypto!

Betting money sent from Hyderabad to China Rs 2,700 crore transferred in the form of crypto!

By ·

Share this article
Betting money sent from Hyderabad to China  Rs 2,700 crore transferred in the form of crypto!

 

 

హైదరాబాద్​ నుంచి చైనాకు బెట్టింగ్ మనీ                                                               

 క్రిప్టో రూపంలో రూ.2,700 కోట్లు బదిలీ!
 

 
టీ మీడియా,నవంబర్13,హైదరాబాద్  బ్యూరో :  బెట్టింగ్​ యాప్స్​ జోలికి వెళ్లొద్దని అధికారులు మొత్తుకుంటున్నా కొందరు అక్రమంగా వినియోగిస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా పోగొట్టుకున్న సొమ్మునంతా చైనా సంస్థలు దోచుకుంటున్నాయి. ఆ సొమ్మును ఇక్కడి నుంచి క్రిప్టో రూపంలో చైనాకు తరలిస్తున్నాయి. ఈ అక్రమాల్లో పలు సాఫ్ట్​వేర్​ సంస్థలు, బ్యాంకులు పాలుపంచుకున్నాయి. వివరాల్లోకి వెళితే,

రూ.2,700 కోట్లు చైనాకు బదిలీ
బెట్టింగ్ యాప్‌ల ముసుగులో క్రిప్టో కరెన్సీ రూపంలో భారీ మొత్తంలో డబ్బును చైనాకు తరలించడంలో పాలుపంచుకున్న హైదరాబాద్‌కు చెందిన 3 సంస్థలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు ప్రారంభించారు. మూడేళ్ల వ్యవధిలో ఈ విధంగా సుమారు రూ.2,700 కోట్లు చైనాకు బదిలీ చేసినట్లు గుర్తించారు. ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్​ చేశారు. గుజరాత్‌లోని కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఈ దందా నడిచినట్లు గుర్తించారు.

మరింత లోతుగా విచారణ
ఈ మేరకు హైదరాబాద్ ఆదాయపు పన్ను అధికారులు దిల్లీలోని తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్న ఈ 3 కంపెనీలపై విచారణ కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

సంస్థలకు 10 శాతం కమీషన్
కల్యాణనగర్, మల్లాపూర్, మాదాపూర్‌ చిరునామాలతో సాఫ్ట్‌వేర్ వ్యాపారాన్ని నడుపుతున్న ఈ 3 కంపెనీలు, బెట్టింగ్ యాప్‌ల నిర్వహణకు అవసరమైన ప్లాట్​ఫాంలుగా పని చేస్తున్నాయి. అంటే చైనా కంపెనీలు అభివృద్ధి చేసిన బెట్టింగ్ యాప్‌లను ఈ సంస్థలు ప్రజల వద్దకు తీసుకువెళ్లేవి. బెట్టింగ్​ ఆడేందుకు కట్టే రుసుము ముందుగా ఈ కంపెనీల ఖాతాలకు వచ్చేది. తర్వాత ఆ సొమ్మును క్రిప్టోగా మార్చి, చైనాకు పంపడంలో ఈ సంస్థలు సహాయపడేవి. ఇందుకోసం వారికి 10 శాతం కమీషన్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

లావాదేవీలన్నీ చైనా నుంచే
గత 3 సంవత్సరాల కాలంలో రూ.2,700 కోట్లు చైనాకు బదిలీ చేయగా, అందులో రూ.270 కోట్లను ఈ 3 కంపెనీలు కమీషన్‌గా అందుకున్నాయి. బెట్టింగ్‌లో ఎవరైనా పెద్ద మొత్తంలో గెలిస్తే వారికి డబ్బు ఇవ్వకుండా, వారి వివరాలన్నింటినీ బ్లాక్ చేసి, వారితో సంబంధాలు తెంచుకున్నట్లు తెలిసింది. ఈ లావాదేవీలన్నీ చైనా నుంచే జరుగుతున్నాయి.

గుజరాత్ కేంద్రంగా అక్రమాలు
బెట్టింగ్‌లో చాలా వరకు చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతాయి. ఈ విధంగా సేకరించిన డబ్బును క్రిప్టోగా మార్చి చైనాకు పంపడం అంత సులభం కాదు. ప్రధాన బ్యాంకులు ఇలాంటి కార్యకలాపాలకు అంగీకరించవు. అందుకే గుజరాత్‌లోని కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఈ దందా నడిపినట్లు తేలింది. ఈ అక్రమంలో సుమారు పదుల సంఖ్యలో గుజరాత్ బ్యాంకులు పాలుపంచుకున్నాయని అధికారులు గుర్తించారు. ముందుగా డబ్బును ఇక్కడి నుంచి గుజరాత్ బ్యాంకులకు పంపి, అక్కడి నుంచి క్రిప్టోగా మార్చి చైనాకు పంపేవారు.

జాతీయ స్థాయి విచారణ
ఈ అక్రమాల్లో భాగంగా ఆయా బ్యాంకులకు భారీ కమీషన్లు చెల్లించినట్లు వెల్లడైంది. ఏయే బ్యాంకుకు ఎంతెంత ముట్టిందో తెలుసుకునేందుకు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే జాతీయ స్థాయి విచారణ జరపాల్సి ఉన్నందున వారు దిల్లీలోని తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ విచారణ దిల్లీ నుంచి జరుగుతోంది. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ సంస్థలపై చర్యలు తీసుకోనున్నారు.

Tags: