సీజ్ చేసిన మేడికల్ షాపు అధికారుల కనుసన్నల్లో గడువుకుముందే తెరచిన వైనం
టీ మీడియా, అక్టోబర్ 28 ,పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చౌక్ లో ఉన్న రాఘవేంద్ర మెడికల్ షాపును డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి 15 రోజుల పాటు సీజ్ చేశారు రాఘవేంద్ర మెడికల్ షాపు యజమానులు గడువు తీర కముందే 4 రోజుల ముందు నుండే షాపును ఓపెన్ చేసి అమ్మకాలు జరుపుతున్నారు అధికారుల అదేశాలను తుంగలో తొక్కిన యాజమాన్యాన్ని వివరణ అడగగా అధికారుల అనుమతితో నే షాపును నడిపిస్తున్నామని అన్నారు ఈ సంఘటనపై డ్రగ్ ఇన్స్పెక్టర్ ను వివరణ అడగగా మాకు ఎలాంటి సమాచారం లేదు షాపు యజమాన్యాన్ని కనుక్కొంటామని అన్నారు ఈ తెరచాటు నాటకంలో షాపు యజమాన్యం అధికారులు కుమ్మక్కైనట్లు సమాచారం ఈవిషయంపై లో లోపల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు



