Hyderabad

BJP sharpens its political strategies - Likely to offer positions to disgruntled leaders!

BJP sharpens its political strategies - Likely to offer positions to disgruntled leaders!

By ·

Share this article
BJP sharpens its political strategies - Likely to offer positions to disgruntled leaders!

 

 

రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ                                                                              -

అసంతృప్త నేతలకు పదవులిచ్చే ఛాన్స్​!


టీ మీడియా,నవంబర్11,  హైదరాబాద్ బ్యూరో : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర కమిటీలో మరిన్ని పదవుల భర్తీకి కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో పదవులు దక్కలేదని అసంతృప్తికి లోనైన వారికి పదవులు కల్పించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్దేశించిన బాధ్యతల నిర్వహణ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని నేతల మధ్య చర్చ నడుస్తోంది.

బీజేపీ రాష్ట్ర పదాధికారుల్లో కొత్తగా మరో 5 పదవులు
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే దిశగా కాషాయదళం ముందుకెళ్తోంది. ఆ క్రమంలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం చర్యలు చేపట్టనుంది. బీజేపీ రాష్ట్ర పదాధికారుల్లో కొత్తగా మరో 5 పదవులు అందుబాటులోకి వస్తాయన్న ప్రచారంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో పార్టీకి సేవలందిస్తున్న పలువురు నేతలు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఉన్న రాజకీయ పరిచయాలు, సంస్థాగత అనుభవం, పార్టీ పెద్దలతో సంబంధాలను ఉపయోగించుకుని దిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నేతలకు బాధ్యతల పునర్విభజన జరిగే అవకాశం
రాష్ట్ర నాయకత్వం దృష్టిలో పడటంతోపాటు జాతీయ నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొత్త నియామకాల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీలో నేతలకు బాధ్యతల పునర్విభజన జరిగే అవకాశముంది. ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న నేతలకు అప్పగించిన పనులతోపాటు కొత్తగా నియమితులయ్యే వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. జిల్లాల వారీగా పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై పోరాటాలు వివిధ మోర్చాల సమన్వయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్​పై వ్యతిరేకతను లబ్ధి చేకూర్చుకునే దిశలో బీజేపీ
రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. అలాగే 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులు ఉన్నారు. వీటికి అదనంగా ఒక జనరల్ సెక్రటరీతో పాటు ఇద్దరు సెక్రటరీలు, ఇద్దరు ఉపాధ్యక్షులను నియమించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణతో పార్టీని బలోపేతం చేయాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారు.

కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా మార్చుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దొరికే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా సంస్థాగతంగా కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నాయకత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం క్షేత్రస్థాయిలో నాయకులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది.

Tags: