మంచిర్యాల

Police officers dance at a birthday party while on duty; Five face disciplinary action, nine others also hit with repercussions.

Police officers dance at a birthday party while on duty; Five face disciplinary action, nine others also hit with repercussions.

By ·

Share this article
Police officers dance at a birthday party while on duty;  Five face disciplinary action, nine others also hit with repercussions.

 

 

డ్యూటీకి వచ్చి బర్త్‌డే పార్టీలో పోలీసుల చిందులు..                                                             

ఐదుగురిపై వేటు.. మరో 9 మందికి షాక్

 

టీమీడియా , నవంబర్ 18,  మంచిర్యాల  : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీసులు ఫామ్‌హౌస్‌లో చిందులు వేయడం వివాదస్పదంగా మారింది. పోలీస్‌స్టేషన్ రికార్డుల్లో ఆన్‌ డ్యూటీలో ఉన్నట్లు నమోదు చేసి ఫామ్‌హౌస్‌లోని బర్త్‌డే పార్టీకి వెళ్లారు స్టేషన్‌ సిబ్బంది. అక్కడ మద్యం మత్తులో మహిళా సిబ్బందితో కలిసి‌ హెడ్ కానిస్టేబుల్లు, కానిస్టేబుల్లు చిందులు వేశారు. స్టేషన్ లోని ఇద్దరు ఏఐఎస్‌లు, ఒక ఎస్‌ఐ మినహా మిగిలిన సిబ్బంది మొత్తం ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, ఉదయం నుండి రాత్రి వరకు మద్యం మత్తులో జల్సా చేస్తూ.. నీటిని వృథా చేస్తూ చిందులు తొక్కడం విమర్శలకు దారి తీసింది. బర్త్‌డే పార్టీలో పోలీసులు డ్యాన్స్‌లు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రామగుండం కమిషనర్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

విధులకు డుమ్మా కొట్టి జల్సాలు చేసిన పోలీసులపై వేటు వేశారు. ఐదుగురు సిబ్బంది పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.. మరో 9 మంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంవహిస్తే సహించేదిలేదని సీపీ స్పష్టంచేశారు.

నీరు వృధా చేయొద్దని ప్రభుత్వం చెబుతున్న తరుణంలో పోలీసు సిబ్బంది రెయిన్ డ్యాన్స్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లో సందడి చేస్తూ.. ఎంజాయ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags: