bhadradri kottagudem

Officials review development works Many issues discussed at zonal level meeting

Officials review development works Many issues discussed at zonal level meeting

By ·

Share this article
Officials review development works  Many issues discussed at zonal level meeting

 

 

అభివృద్ధి పనులపై అధికారుల సమీక్ష

మండల స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చ

 

టీ మీడియా,నవంబర్11,సింగరేణి(కారేపల్లి):ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.మండల ప్రత్యేక అధికారి ప్రమీల,ఎంపీడీవో బి.పద్మ,తహసీల్దార్ ఓ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వివిధ శాఖల పనితీరు,అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష చేపట్టారు.మండలంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు,గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు,స్థానిక సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Tags: