Telangana

For the students of Kusumanchi College: Botany Field Trip

For the students of Kusumanchi College: Botany Field Trip

By ·

Share this article
For the students of Kusumanchi College:  Botany Field Trip

 

 

కూసుమంచి  కాలేజీ  విద్యార్థుల కి  

బోటనీ  ఫీల్డ్  ట్రిప్

 


టీ మీడియా, నవంబరు 11,కూసుమంచి : మండల కేంద్రం కూసుమంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ సంవత్సరం బైపీసీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ వీరభద్రరావు, వృక్షశాస్త్ర అధ్యాపకురాలు కళ్యాణి ఆధ్వర్యంలో బోటనీ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల సమీపంలోని చెరువులు, పొలాలు, సహజ పరిసర ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లి వివిధ రకాల సాధారణ మొక్కలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి గుర్తింపు గురించి అధ్యాపకురాలు వివరించారు. హెర్బేరియం తయారీ నిమిత్తం వివిధ మొక్కల కొమ్మలు, ఆకులు, పుష్పాలను సేకరించే విధానాన్ని విద్యార్థులకు ఆమె తెలియజేశారు. ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు మొక్కలపై ప్రత్యక్ష అవగాహనతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానం చేకూరుతుందని ప్రిన్సిపల్ వీరభద్రరావు, అధ్యాపకురాలు కళ్యాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Tags: