ప్రజా సేవలో ఆదర్శంగా.... జుజ్జులరావుపేట గ్రామ
మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు
టీ మీడియా, నవంబరు 10 ,కూసుమంచి :పదవులు ఉన్నా.... లేకున్నా.....ప్రజలకు సేవ చేయాలనే సంకల్పమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం అని నిరూపించుకున్నారు వారు. గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి, తమ సొంత ఖర్చులతో ముందుండి నిలిచారు. సుమారు 12 లక్షల రూపాయలకు పైగా తమ సొంత ఖర్చు హెచ్చించి, ప్రజా అవసరాలని తీర్చుతూ ప్రజలకి సేవాకానుకగా అందజేశారు. పాలేరు నియోజకవర్గo పరిధిలోని కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామ మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు అందరికీ ఆదర్శంగా నిలిచి, అభినందనలతో ప్రజా ప్రశంసలు పొందారు. కూసుమంచి మండలంలోని జుజ్జులపేట గ్రామంలో అంత్యక్రియల సందర్భంగా స్మశాన వాటికలో సరిపడా వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. స్మశాన వాటిక ప్రక్కగా చెరువు ఉన్నప్పటికీ, చెరువులో నీరు లేని సమయములో ప్రజలు ఎదుర్కొనే కష్టాలు వర్ణనాతీతం. స్మశాన వాటికలో ప్రజలకి నీటి సమస్య అతి ప్రధానమైనది. అయితే జుజ్జులరావుపేట గ్రామపంచాయతీలో ఎప్పుడు సరిపడా నిధులు లేకపోవడంతో స్మశాన వాటిక సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఇదంతా తాను సర్పంచిగా ఉన్నప్పుడు దగ్గరుండి గమనించిన జుజ్జులరావుపేట గ్రామ మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు తమ సొంత ఖర్చులతో సమస్యలను పరిష్కరించేందుకు ముందుండి నిలిచి శ్రీకారం చుట్టారు. తమ కుమారుడు కీర్తిశేషులు మందడి నరేష్ రెడ్డి జ్ఞాపకార్థం సుమారు 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చుతో వాటర్ ట్యాంకర్, వైకుంఠ రథాన్ని కొనుగోలు చేసి గ్రామ ప్రజలకి కానుకగా అందించారు. దాంతో జుజ్జులరావుపేట గ్రామ స్మశానవాటికలో సమస్యలకి శాశ్వతం పరిష్కారమైంది. ప్రజా ప్రతినిధిగా ( సర్పంచి గా ) ఉన్న సమయంలోనే కాకుండా పదవీకాలం ముగిసిన తర్వాత తమ సొంత ఖర్చులతో ప్రజా సేవను చాటుకుని, ఆదర్శంగా నిలిచిన జుజ్జుర్రావు పేట గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మందడి పద్మ వెంకటరెడ్డి దంపతులు ప్రజలందరి అభినందనలు, ప్రశంసలు పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమాలను ఖమ్మం క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా తుంబూరి దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా పదవీకాలం ముగిసిన తరువాత ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయడం గొప్ప విశేషమని, మందడి పద్మ వెంకటరెడ్డి దంపతుల కుమారుడు కీర్తిశేషులు మందడి నరేష్ రెడ్డి జ్ఞాపకార్థం, వారు తమ సొంత ఖర్చులతో గ్రామానికి వైకుంఠ రథం, వాటర్ ట్యాంకర్ అందించడం అభినందనీయమని, వారి సేవా దృక్పథం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ భీమ్ రెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, కంచర్ల జీవన్ రెడ్డి, చాట్ల పరశురాం, శ్యాంసుందర్ రెడ్డి, బాణోత్ రవి ,మాజీ ఎంపీటీసీ వాకా సుధారాణి, సర్పంచులు వడిత్య వెంకటేష్ నాయక్, బానోత్ నాగేశ్వరరావు , దాట్ల సతీష్, జజ్జులరావుపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కలకొండ పున్నయ్య, గ్రామ ఉపసర్పంచ్ గంగా భవాని, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




![A dispute over one and a half acres of land... Brutally [attacked/harmed] his younger brother's wife... A dispute over one and a half acres of land... Brutally [attacked/harmed] his younger brother's wife...](https://www.tmedia.net.in/uploads/posts/20261104-161016-6ac851ef.jpg)


