Hyderabad

గాలి ఆడదు - ఏసీ ఆగదు

గాలి ఆడదు - ఏసీ ఆగదు

By ·

Share this article
గాలి ఆడదు - ఏసీ ఆగదు

💐
గాలి ఆడదు - ఏసీ ఆగదు

 - శీతాకాలంలోనూ రికార్డు స్థాయిలో విద్యుత్​ 

 

 

 


 టీ మీడియా, నవంబర్ 2,హైదరాబాద్  బ్యూరో: ఎల్​నినో ప్రభావంతో రోజువారీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లో అక్టోబరు​ నెలలో రికార్డు స్థాయిలో విద్యుత్​ను వినియోగించారు.

 

 

ఎల్​నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఊహించని రీతిలో ఉంటున్నాయి. అక్టోబర్​లో చలి లేకపోవడం, దానికి తోడు తీవ్రమైన వేడి ఉంటోంది. దీంతో విద్యుత్ డిమాండ్, వినియోగంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. శీతాకాలంలో ఈ విద్యుత్ వినియోగం ఊహించని గరిష్ట స్థాయిని తాకింది. దసరా పండుగ రోజులను మినహాయిస్తే, సగటు రోజువారీ గరిష్ఠ డిమాండ్ 3,894 మెగావాట్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం నమోదైన సగటు 3,290 మెగావాట్లతో పోలిస్తే దాదాపు 600 మెగావాట్లు ఎక్కువ.

 

 

 

విద్యుత్ వినియోగంలో 22 శాతం పెరుగుదల

గత ఏడాది అక్టోబర్​లో 2,037 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ వినియోగం ఈ ఏడాది 2,499 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 462 మిలియన్ యూనిట్లు అధికంగా నమోదైంది. అంటే 22.65 శాతం వృద్ధి నమోదైంది. ఈ అదనపు వినియోగం దాదాపు 8 రోజులకు సరిపడా విద్యుత్తుతో సమానం.

 

 

 

 

నవంబరులో భారీ విద్యుత్ బిల్లులు

సాధారణంగా శీతాకాలంలో విద్యుత్ వినియోగం తగ్గడం వల్ల బిల్లులు కూడా తగ్గుతాయి. అయితే ఈసారి వినియోగం రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ నెలలో వినియోగదారులకు విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా 2023లో వినియోగించిన విద్యుత్ యూనిట్లకు ఈ నెల నుంచే ట్రూ అప్ ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్​సీ) అనుమతి ఇచ్చింది. అప్పుడు వినియోగించిన విద్యుత్​ ప్రతి యూనిట్‌కు 30 పైసల చొప్పున ఈ ఛార్జీలను వసూలు చేయనున్నారు. అంటే 200 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తే బిల్లుపై అదనంగా రూ.60 పెరుగుతుంది.

 

 

 

 

 

 

 

సాధారణం కంటే 5 డిగ్రీలు అధికం

హైదరాబాద్​ నగరంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. ఒకటి రెండు రోజులు స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రస్తుతం సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలోనూ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా దోమల బెడద కూడా ఎక్కువగా ఉందిపటాన్‌చెరులో ఇటీవల కనిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోగా, ఆదివారం రాత్రికి అది 23.4 డిగ్రీలకు పెరిగింది. ఇది సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కంటే 5.6 డిగ్రీలు అధికమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజేంద్రనగర్‌లో 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇది సాధారణం కంటే 4.8 డిగ్రీలు ఎక్కువ.హయత్​నగర్‌లో 22.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు అధికంగా ఉంది. బేగంపేటలో రాత్రిపూట ఉష్ణోగ్రత 24.2 డిగ్రీలకు చేరుకుంది. అయితే ఇక్కడ సాధారణంగా 19.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దుండిగల్​లో 23.6 డిగ్రీలు, హకీంపేటలో 24 డిగ్రీలు నమోదయ్యాయి. అయితే పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చితే 1.3 డిగ్రీలు తక్కువ కావడం విశేషం.