pebberu

ఎండిన వరిపంటలకు నష్ట పరిహారం

ఎండిన వరిపంటలకు నష్ట పరిహారం

By ·

Share this article
ఎండిన వరిపంటలకు నష్ట పరిహారం

ఎండిన వరిపంటలకు నష్ట పరిహారం 


టీ మీడియా, అక్టోబర్ 21, పెబ్బేరు:వనపర్తి జిల్లా పెబ్బేరు మండలలోని రామమ్మ పేట శివారులో రైతాంగ పోరాట సమితి అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య ఆధ్వర్యంలో క్షేత్ర స్ధాయిలో రైతుల గోస జూరాల ఎడమ కాలువ కింద వున్న 18 వ డిస్ట్రిబ్యూటర్ చివరి ఆయకట్టు దాకా పంటలకు నీరు అందక వందల ఎకరాల వరి పంటలు ఎండిపోయాయి ఒక ఎకరాకు 35 నుండి 40 వేల రూపాయల పెట్టుడులను పెట్టామని రైతులు అవేదన చెoదుతున్నారు  కాలువ చివరి పంట వరకు నీరు అందాలంటే ఇంకా 2 రోజులు నీరు విడుదల చేయాలని ఎండిన పంటలకు ఎకరాకు 35 వేల నష్ట పరిహారం ఇవ్వాలని  తెలంగాణ రైతాంగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య వివిధ గ్రామాల రైతులు పాల్గొని డిమాండ్ చేశారు.