ఖమ్మం _ సూర్యాపేట జాతీయ రహదారిపై
వరుస ప్రమాదాలు.
టీ మీడియా, అక్టోబర్ 28 ,కూసుమంచి :ఖమ్మం _ సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కూసుమంచి మండలం, జుజ్జులరావుపేట గ్రామ సమీప, ఖమ్మం _ సూర్యాపేట హైవే రోడ్డుపై అన్నపూర్ణ దాబా హోటల్ దగ్గర మంగళవారం రాత్రి ట్రాక్టర్ని, డీసీఎం ఢీ కొట్టిన సంఘటన జరిగింది. ఈ సందర్భంగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో మరో 2 కంటైనర్లు, ఆయిల్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాద సంఘటనలో లారీ డ్రైవర్ కి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.






