CRIME

Tragedy in Medak district... Mother commits suicide by jumping into the Manjira River with her two daughters.

Tragedy in Medak district... Mother commits suicide by jumping into the Manjira River with her two daughters.

By ·

Share this article
Tragedy in Medak district...  Mother commits suicide by jumping into the Manjira River with her two daughters.

 

మెదక్‌ జిల్లాలో విషాదం..                                                                                                                                 

ఇద్దరు కూతుళ్లతో మంజీరా నదిలో దూకి                                                                                                         

తల్లి ఆత్మహత్య 
 

  టీమీడియా , అక్టోబర్ 28 , మెదక్‌ : మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీరా నదిలో దూకి తల్లి, ఇద్దరు చిన్నారుల మృతిచెందారు. బుధవారం ఉదయం చిన్న ఘనపూర్‌ శివారులోని మొదటి బ్రిడ్జి సమీపంలో వారి మృతదేహాలను కొల్చారం పోలీసులు వెలికితీశారు. తల్లితోపాటు ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన గంగోల్ల సరిత (27)కు ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (7), సాన్విక (6) ఉన్నారు. సరిత భర్త గతంలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబ బాధ్యతలు ఆమెపై పడ్డాయి. పిల్లలను తల్లిగారి ఇంట్లో ఉంచి, హైదరాబాద్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగించేది. అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి పిల్లలను చూసి తిరిగి వెళ్లేది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సరిత.. పిల్లలను తాను పనిచేసే చోట ఉంచుకోలేక, మరోచోట వదిలి వెళ్లాల్సి రావడంపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పేర్కొన్నారు.

ఆధార్‌ కార్డులో సవరణ చేయించుకోవాలని చెప్పి సరిత తన తల్లి వద్ద ఉన్న ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్లినట్లు బంధువులు తెలిపారు. అనంతరం ఏడుపాయలకు చేరుకున్న ఆమె.. పిల్లలతో కలిసి మంజీరా నదిలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నదిలో గాలింపు చేపట్టి బుధవారం మృతదేహాలను వెలికితీశారు.

కొల్చారం ఎస్‌ఐ మయినుద్దీన్‌ మృతదేహాలకు పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: