hyderabad

Rs 6,000 crore CMR scam Officials who should have provided protection are instead backing the fraudsters The misdeeds of insiders come to light

Rs 6,000 crore CMR scam Officials who should have provided protection are instead backing the fraudsters The misdeeds of insiders come to light

By ·

Share this article
Rs 6,000 crore CMR scam  Officials who should have provided protection are instead backing the fraudsters  The misdeeds of insiders come to light

 

 

రూ.6 వేల కోట్ల సీఎంఆర్ కుంభకోణం 

కాపాడాల్సిన అధికారులే కేటుగాళ్లకు అండగా                                                                                                 

తెరపైకి ఇంటిదొంగల బాగోతం

 

టీ మీడియా నవంబరు 4,హైదరాబాద్: తెలంగాణ పౌరసరఫరాల శాఖలో సంచలనం రేపుతున్న కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సుమారు రూ.6 వేల కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి చేరకపోవడం వెనుక మిల్లర్ల అక్రమాలతోపాటు, వాటిని అడ్డుకోవాల్సిన అధికారుల పాత్ర కూడా వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వ ధాన్యాన్ని కాపాడాల్సిన కొందరు అధికారులే అక్రమాలకు సహకరించినట్లు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సీఐడీ దర్యాప్తుల్లో పలు కీలక అంశాలు బయటపడుతున్నాయి.

అక్రమాలకు అండగా అధికారులే!

సీఎంఆర్ కేటాయింపుల సమయంలో ధాన్యం పక్కదారి పట్టకుండా జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్, మిల్లర్‌ను జాయింట్ కస్టోడియన్లుగా ప్రభుత్వం నియమిస్తుంది. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియ, బియ్యం అప్పగింతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. అక్రమాలు జరిగితే గుర్తించి చర్యలు తీసుకోవాల్సింది ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ఈటీఎఫ్).

అయితే కొందరు అధికారులు తమ విధులను విస్మరించడమే కాకుండా, మిల్లర్లతో కుమ్మక్కై అక్రమాలకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణ పొందిన అధికారులు సైతం ఐదు నుంచి పదేళ్లుగా ఓఎస్డీలుగా కొనసాగుతూ కీలక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు విచారణలో అంశాలు వెలుగుచూస్తున్నాయి.

మూడు జిల్లాల్లోనే భారీ బకాయిలు!

రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్ బకాయిల విలువ సుమారు రూ.6 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో పెద్ద మిల్లర్ల వాటానే దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారుల అంచనా. మూడు జిల్లాల్లోనే మొత్తం బకాయిల్లో సుమారు 25 శాతం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాలో రూ.670 కోట్లు, దక్షిణ తెలంగాణలోని మరో జిల్లాలో సుమారు రూ.600 కోట్లు, హైదరాబాద్ సమీపంలోని ఇంకో జిల్లాలో రూ.300 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఓ జిల్లా సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్‌తో పాటు ఈటీఎఫ్‌లోని కొందరు అధికారులు పాత్రపై విచారణ కొనసాగుతోంది.

బినామీ మిల్లుల వెనుక ఎవరి హస్తం?

సీఎంఆర్ బకాయిలతో డిఫాల్ట్ అయిన మిల్లర్లు బినామీల పేర్లతో కొత్త మిల్లులు ప్రారంభిస్తే గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత ఈటీఎఫ్‌దే. కానీ దక్షిణ తెలంగాణలో డిఫాల్ట్ అయిన ఓ మిల్లర్ ఉత్తర తెలంగాణ జిల్లాలో బినామీల పేర్లతో ఏకంగా ఎనిమిది రైస్‌మిల్లులు ప్రారంభించినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

నిర్మల్ జిల్లాలో నాలుగేళ్లలో 24 కొత్త రైస్‌మిల్లులకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. వీటిలో కొన్ని చిన్నపాటి షెడ్లలో నడిచే మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు జరగడం, ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండానే పక్కదారి పట్టించి విక్రయించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది.

యంత్రం లేకుండానే సీఎంఆర్ కేటాయింపులు!

ములుగు జిల్లాలోని ఓ రైస్‌మిల్లులో సాల్టెక్స్ యంత్రం ఉన్నట్లు మూడేళ్ల క్రితమే ఈటీఎఫ్ అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఆ మిల్లుకు సీఎంఆర్ కేటాయింపులు జరిగాయి. అయితే ఇటీవల దర్యాప్తు అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు అక్కడ సాల్టెక్స్ యంత్రాన్ని అప్పుడే బిగిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. గతంలో యంత్రం ఉన్నట్లు ధ్రువీకరించిన అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపుల వెనుక ముడుపుల వ్యవహారం ఉందా? అనే కోణంలో విచారణ సాగుతోంది.

అక్రమాలకు ప్రత్యేక కార్యాలయాలా?

మిల్లర్లతో అక్రమ లావాదేవీల వ్యవహారాలు చర్చించేందుకు కొందరు అధికారులు ప్రైవేట్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. కోదాడలో ఒకరు, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మరో ఇద్దరు అధికారులు కార్యాలయాలు నిర్వహించినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

ఇటీవల ఈటీఎఫ్‌లోని ఓ ఓఎస్డీని విధుల నుంచి తొలగించగా, మరో అధికారిని సీఐడీ అరెస్టు చేసినట్లు కథనంలో పేర్కొన్న వివరాలు వెల్లడిస్తున్నాయి. వీరు ఆరేళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేసిన సమయంలో వందల కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలు పేరుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పీడీఎస్ బియ్యం లారీల వ్యవహారంలోనూ అనుమానాలు!

గత ఆగస్టులో దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో ఓ వ్యాపారికి చెందిన పది పీడీఎస్ బియ్యం లారీలను ఈటీఎఫ్ అధికారులు పట్టుకున్నప్పటికీ, ఒక్క లారీపై మాత్రమే కేసు నమోదు చేసి మిగిలిన తొమ్మిది లారీలను వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయా? అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ఆదేశాలకూ విలువ లేదా?

పౌరసరఫరాల శాఖలో ఏళ్ల తరబడి ఓఎస్డీలుగా కొనసాగుతున్న అధికారులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఓ ఈటీఎఫ్ అధికారి మిల్లర్ల నుంచి ఆర్థిక సహాయం పొంది ఆలయ నిర్మాణం చేపట్టారన్న ఆరోపణలు కూడా విచారణ పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Tags: