hyderabad

Water mafia in Hyderabad... - Making a business worth crores by extracting water...

Water mafia in Hyderabad... - Making a business worth crores by extracting water...

By ·

Share this article
Water mafia in Hyderabad...  - Making a business worth crores by extracting water...

 

హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా..                                                          

-నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం..  
                                                                                                                                     

టీమీడియా , అక్టోబర్ 27 ,  హైదరాబాద్  బ్యూరో : హైదరాబాద్‌ పరిసరాల్లో అక్రమ బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడేస్తూ ట్యాంకర్లతో విక్రయిస్తున్న నీటి వ్యాపారంపై హైడ్రా చర్యలు చేపడుతోంది. సున్నం చెరువు ప్రాంతంలో 25 అక్రమ బోర్లను తొలగించిన అధికారులు, తమ్మిడికుంటలో మరో ఆరు బోర్లను తొలగించారు. అనుమతులు లేకుండా బోర్లు వేసి నీటిని వ్యాపార అవసరాలకు వినియోగించడంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతోంది.
హైదరాబాద్‌లో వాటర్‌ మాఫియా.. నీటిని తోడేస్తూ కోట్లల్లో వ్యాపారం.. నెట్‌వర్క్‌పై హైడ్రా ఫోకస్‌

అక్రమ బోర్లపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. మొన్న సున్నం చెరువు, నేడు తమ్మిడికుంట. రేపు మరో చోట అన్నట్టుగా హైడ్రా దూసుకెళ్తూ వాటర్‌ మాఫియా భరతం పడుతోంది. భూగర్భ జలాలను పీల్చి పిప్పి చేస్తున్న  అక్రమ నీటి దందాపై హైడ్రా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సున్నం చెరువు ప్రాంతంలో 25 అక్రమ బోర్లను తొలగించిన హైడ్రా మిగతా చోట్ల కూడా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. గుట్టుగా బోర్లు వేసి భారీగా పైప్‌లైన్లను వేసిన నెట్‌వర్క్‌లను తొలగిస్తోంది. వాటర్‌ మాఫియాపై ఉక్కుపాదం ప్రదర్శిస్తూ వారి నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తోంది. తమ్మిడి కుంటలో కూడా ఇలాంటి అక్రమ బోర్లు ఉన్నాయని తెలుసుకున్న హైడ్రా.. కొరఢా ఝులిపించింది. ఆరు బోర్లను తొలగించింది. హైదరాబాద్‌ పరిసరాల్లో అనేక చోట్ల అక్రమ బోర్లతో నీటి దందా యథేచ్ఛగా సాగుతోంది. నీళ్లను ఇష్టానుసారంగా తోడేస్తూ.. వ్యాపారం చేస్తు్న్నారు. భూగర్బజలాలు మరింత పడిపోవడానికి కారణమవుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఇన్నేళ్లు కోట్లల్లో అక్రమ నీటి వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇటీవల వీటిపై ఫోకస్‌ పెట్టిన హైడ్రా.. ఒక్కో ప్రాంతంపై దృష్టి సారిస్తూ వెళుతోంది. భూగర్బజలాలు పడిపోవడంతో చాలా చోట్ల నీటి కటకట కొనసాగుతోంది. అందుకు కారణం అక్రమ బోర్లతో నీటి దందా కొనసాగిస్తుండడమే కారణమని బయటపడడంతో.. విరుచుకుపడుతున్నారు.

గృహ అవసరాల కోసం వేసుకున్న బోర్లను వ్యక్తిగత అవసరాల కోసం వాడకుండా.. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. చెరువుల పక్కనే ఉన్న కొన్ని కాలనీల్లో అక్రమంగా బోర్లు వేసి నీటిని తోడేస్తూ.. జలదోపిడికి పాల్పడుతున్నారు. చాలా చోట్ల అనుమతులు లేకుండానే బోర్లు వేసి మరీ ఈ నీటి దందాను కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌ పరిణామాన్ని బట్టి రూ. 1000 నుంచి రూ. 3వేల వరకు విక్రయిస్తున్నారు. వేసవి రోజుల్లో ఈ దందా రూ. 5వేలు వరకు ఉంటుందన్న ప్రచారం ఉంది. హాస్టళ్లు, హోటళ్లకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ నీటిని జలగల్లా తోడేస్తున్నారు. అక్రమ నీటి దందాపై అధికారుల సమాచారం ఉన్నా.. ఇన్నాళ్లూ చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం కరువు, ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా హైడ్రా ముందుకు వచ్చిందన్న ప్రచారం సాగుతోంది.

Tags: