Hyderabad

Paddy worth thousands of crores goes missing in Telangana! Paddy valued at Rs 2,196 crore has vanished; CID and Vigilance departments step in. Criminal cases filed against 63 millers; 25 arrested.

Paddy worth thousands of crores goes missing in Telangana! Paddy valued at Rs 2,196 crore has vanished; CID and Vigilance departments step in. Criminal cases filed against 63 millers; 25 arrested.

By ·

Share this article
Paddy worth thousands of crores goes missing in Telangana!   Paddy valued at Rs 2,196 crore has vanished; CID and Vigilance departments step in.   Criminal cases filed against 63 millers; 25 arrested.

 

 

తెలంగాణలో వేల కోట్ల ధాన్యం మాయం!

రూ.2,196 కోట్ల ధాన్యం గల్లంతు.. రంగంలోకి సీఐడీ, విజిలెన్స్

63 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు.. 25 మంది అరెస్ట్‌
 

 

టీమీడియా , నవంబర్ 19,  హైదరాబాద్​  బ్యూరో :తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం, బియ్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇప్పటివరకు 26 జిల్లాల్లోని సుమారు 300 రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా రూ.2,196 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.
రూ.6,700 కోట్ల అక్రమాలపై అనుమానాలు
2021-22 నుంచి కస్టమ్ మిల్లింగ్ కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్ మిల్లుల్లో కొన్ని మిల్లులు ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుమారు రూ.6,700 కోట్ల అక్రమాలు జరిగినట్లు శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
                                                                                                                                                                      నాలుగు జిల్లాల్లో భారీగా గల్లంతు                                                                                                               సూర్యాపేట – రూ.810 కోట్లు,నిర్మల్ – రూ.670 కోట్లు,నిజామాబాద్ – రూ.600 కోట్లు, మెదక్ – రూ.300 కోట్లు.
ఈ జిల్లాల్లోని మిల్లులపై విజిలెన్స్ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా ఏర్పాటైన రైస్ మిల్లుల వివరాలు, వాటి కార్యకలాపాలు, అక్రమాలకు అధికారుల సహకారం ఉందా అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.
63 మంది మిల్లర్లపై కేసులు.. 25 మంది అరెస్ట్‌
ధాన్యం గల్లంతు వ్యవహారంలో ఇప్పటివరకు 63 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రికవరీ నోటీసుల నేపథ్యంలో మిల్లర్లు ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్లు ప్రభుత్వానికి తిరిగి చెల్లించినట్లు సమాచారం.
అరెస్టు భయంతో హైకోర్టును ఆశ్రయిస్తున్న మిల్లర్లు
సూర్యాపేటలో రూ.430 కోట్లు, నిజామాబాద్‌లో రూ.240 కోట్లు, నిర్మల్‌లో రూ.230 కోట్లు తిరిగి వసూలైనట్లు అధికారులు వెల్లడించినట్లు సమాచారం. మిగిలిన మొత్తాన్ని రాబట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు సీఐడీ కూడా విచారణలోకి రావడంతో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది మిల్లర్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిందా? మిల్లర్ల అక్రమాలకు అధికారుల సహకారం ఉందా? వేల కోట్ల ప్రజాధనానికి బాధ్యులెవరు?

ఈ ప్రశ్నలకు దర్యాప్తు సంస్థల విచారణలో సమాధానాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్, బియ్యం అప్పగింత వరకు ప్రతి దశలో పారదర్శకత ఉండాల్సిన అవసరాన్ని ఈ వ్యవహారం మరోసారి గుర్తుచేస్తోంది.

Tags: