పల్నాడు

It was fine during the night... By morning, it had been cut... Who is cutting the girls' braids in the hostel?

It was fine during the night... By morning, it had been cut... Who is cutting the girls' braids in the hostel?

By ·

Share this article
It was fine during the night...  By morning, it had been cut...  Who is cutting the girls' braids in the hostel?

 

రాత్రి బాగానే ఉంది..                                                                        

తెల్లారేసరికి కత్తిరించి ఉంది..                                                                        

హాస్టల్లో అమ్మాయిల జడలు కత్తిరిస్తున్నదెవరు?
 

టీ మీడియా,నవంబర్11,  పల్నాడు :  పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రామక్రిష్ణాపురంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల హాస్టల్లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మొదట్లో ఏమీ లేదని అందరూ కొట్టిపారేసినా రోజుల గడిచే కొద్ది ఆగడాలు పెరిగిపోతుండటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నిద్ర పోయేటప్పుడు సరిగానే ఉన్న జడలు తెల్లవారి లేచి చూసేసరికి కత్తిరించి ఉండటాన్ని విద్యార్థినులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా ప్రతి రోజూ తెల్లవారే సరికి ఎవరో ఒకరి జడలు కత్తిరించి ఉంటున్నాయి. ఇలా ప్రతిరోజూ జరుగుతున్నా.. హాస్టల్ సిబ్బంది పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురకుల పాఠశాల హాస్టల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థినులంతా ఒకే చోట నిద్రిస్తారు. తెల్లవారి లేచి సరికి వీరిలో ఎవరో ఒకరి జడ కత్తిరించి ఉంటున్నాయి. గత వారం రోజుల్లో పది మంది విద్యార్థినులు జడలు కత్తిరించారు గుర్తు తెలియని వ్యక్తులు… దీంతో నిద్ర పోవాలంటేనే భయపడే స్థాయికి విద్యార్థినులు చేరుకున్నారు. అయితే హాస్టల్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. గుర్తు తెలియని వ్యక్తులు జడలు కత్తిరిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ హాస్టల్ విద్యార్ధుల చేతులపై కట్ చేసినట్లు తల్లిద్రండులు ఆరోపించారు. ఇలా జరుగుతుంటే అధికారులు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా అసలేం జరగలేదన్నట్లు వ్యవహరించడం సరైన పద్దతి కాదంటున్నారు పేరెంట్స్..

హాస్టల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఇప్పుడు అర్థరాత్రుల్లో ఎవరో వచ్చి జడలు కట్ చేస్తున్నారని విద్యార్ధునులు చెబుతున్న మాటలను అధికారులు సీరియస్ గా తీసుకోవాలి. అసలు హాస్టల్లో బయట వ్యక్తులు వస్తున్నారా లేక విద్యార్థినులే ఇలా తోటి వారి జడలు కట్ చేస్తున్నారా అన్న అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంది. హాస్టల్ విద్యార్థినులే ఇలా చేస్తే వారిని ఇంటికి సాగనంపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ బయట వ్యక్తులు వస్తే వారిని అరెస్ట్ చేయించాలంటున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని చిన్నదిగా చూడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. హాస్టల్ అధికారులు పట్టించుకోకుంటే తామే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు.

Tags: