ఆళ్లపల్లి

Toddy tapper Kothi Yadagiri dies after falling from a palm tree

Toddy tapper Kothi Yadagiri dies after falling from a palm tree

By ·

Share this article
Toddy tapper Kothi Yadagiri dies after falling from a palm tree

 

​తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు కోతి యాదగిరి మృతి

 

టీ మీడియా , అక్టోబర్ 27 , ఆళ్లపల్లి ; ఆళ్లపల్లి మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాటిచెట్టు పైనుంచి కిందపడి ఒక గీత కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మర్కోడు గ్రామానికి చెందిన గీత కార్మికుడు కోతి యాదగిరి ప్రతిరోజులాగే యథావిధిగా కల్లు తీసేందుకు గ్రామ సమీపంలోని తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో అనుకోకుండా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి కింద పడిపోయాడు.
​పైనుంచి కింద పడటంతో యాదగిరికి తీవ్ర గాయాలై, స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. రోజువారీ పనికి వెళ్లిన వ్యక్తి శవమై తేలడంతో మర్కోడు గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. యాదగిరి మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags: