ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ అండ్ ఇన్నోవేషన్‌పై వర్క్‌షాప్ ప్రారంభం!!
చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు
టి మీడియా ,అక్టోబర్ 30 ,ఖమ్మం రూరల్: ఏదులపురం మున్సిపాలిటీ ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (అటానమస్) కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్ సహకారంతో హెచ్‌అండ్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 30, 31 తేదీల్లో “నెక్స్ట్‌జెన్ బీటెక్ ఇంజినీర్స్: ఏఐ అండ్ ఇన్నోవేషన్” అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కాటేపల్లి కె. నవీన్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుత సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థులు ఏఐ టూల్స్‌తో పాటు సీ, సీ++, డేటాబేస్ వంటి ప్రాథమిక సాంకేతిక అంశాల్లో నైపుణ్యం సాధించి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ బి. గోపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు రియల్‌టైమ్ ప్రాజెక్టులు, ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టి సారించాలని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. ప్రియదర్శిని విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాల వైపు ముందుకు సాగాలని సూచించారు. అకడమిక్ డైరెక్టర్ ఎ. వెంకట రమణ ఏఐ ఆధారిత సాంకేతిక రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
స్కిల్స్‌బిల్డ్ టెక్నికల్ యూత్ ట్రైనర్ నదియా నాజ్ మాట్లాడుతూ, ఈ వర్క్‌షాప్‌లో విద్యార్థులకు ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై ఆచరణాత్మక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ కె. గౌతమి, ఆర్. లక్ష్మీ ప్రసన్న, ఎస్. శిరీష, హెచ్‌అండ్‌ఎస్ విభాగాధిపతి ఎన్. అనిత, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ మన్మోహన్ తివారీ, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






