karepalli khammam district

ఇంటింటికీ ఎమ్మెల్సీ ఓటు నమోదు

ఇంటింటికీ ఎమ్మెల్సీ ఓటు నమోదు

By ·

Share this article
ఇంటింటికీ ఎమ్మెల్సీ ఓటు నమోదు

ఇంటింటికీ ఎమ్మెల్సీ ఓటు నమోదు

పట్టభద్రులంతా నమోదు చేసుకోవాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంబాబు

టీ మీడియా,అక్టోబర్31,సింగరేణి(కారేపల్లి):అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరుగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ సింగరేణి మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు కోరారు.సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో సర్పంచ్ బానోత్ హీరాలాల్‌తో కలిసి ఆయన ఇంటింటికీ తిరుగుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఓటరు నమోదుకు గడువు తక్కువగా ఉన్నందున అర్హులైన పట్టభద్రులు ఆలస్యం చేయకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.ఓటు హక్కు పొందేందుకు అవసరమైన ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి మద్దతు తెలిపి,మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుగులోత్ భీముడు నాయక్,మండల పార్టీ సమన్వయకర్త వాంకుడోత్ గాంధీ,ఐఎన్‌టీయూసీ నాయకుడు లావు డ్యాఈర్య,బీఎల్‌ఏ గుగులోత్ ప్రసాద్,నాయకులు వాంకుడోత్ రాంబాబు,కోఆర్డినేటర్ దారావత్ యేసు,దాస్య,బన్సీ,సామ్య తదితరులు పాల్గొన్నారు.