Telangana

Pressure for bill payments without completing the work!! Allegations leveled against the contractor by DE Chintamala Nageswara Rao

Pressure for bill payments without completing the work!! Allegations leveled against the contractor by DE Chintamala Nageswara Rao

By ·

Share this article
Pressure for bill payments without completing the work!!  Allegations leveled against the contractor by DE Chintamala Nageswara Rao

 

 

పనులు పూర్తి చేయకుండానే బిల్లుల కోసం ఒత్తిడి!!


కాంట్రాక్టర్‌పై  డీఈ చింతమల నాగేశ్వరరావు ఆరోపణలు


టి మీడియా,  అక్టోబర్ 30, ఖమ్మం రూరల్ ; అసంపూర్తిగా ఉన్న విద్యుత్ పనులకు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ, నిబంధనల ప్రకారం వ్యవహరించిన అధికారులపై కాంట్రాక్టర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖమ్మం రూరల్ విద్యుత్ శాఖ డీఈ చింతమల నాగేశ్వరరావు ఆరోపించారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు సమర్పించాలని చేసిన డిమాండ్‌కు అధికారులు అంగీకరించకపోవడంతో తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఉన్న ఖమ్మం రూరల్ సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఈ మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద లైన్ మార్పు పనుల కోసం రూ.37 లక్షలతో అంచనాలు రూపొందించినట్లు తెలిపారు.
ఈ పనుల్లో భాగంగా చిన్న వెంకటగిరిలో ఆరు టవర్లు, చిన్నతండాలో నాలుగు టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. చిన్న వెంకటగిరిలో చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు ఎల్‌ఓసీ అందించినట్లు వెల్లడించారు. అయితే చిన్నతండాలో రెండు టవర్లు మాత్రమే ఏర్పాటు చేసి, మిగిలిన పనులను అసంపూర్తిగా వదిలేశారని తెలిపారు. టవర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ వైర్లు లాగకపోవడంతో పనులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని వివరించారు.
పనులు పూర్తయిన తర్వాతే బిల్లులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులన్నీ పూర్తిచేసిన తర్వాతే బిల్లులు సమర్పించాలని కాంట్రాక్టర్‌కు స్పష్టం చేసినట్లు డీఈ తెలిపారు. అయినప్పటికీ, పనులు పూర్తి చేయాలన్న అధికారుల సూచనలను పట్టించుకోకుండా, బిల్లుల విషయంలో అధికారులు సహకరించడం లేదంటూ కార్యాలయానికి వచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చేసిన పనులకు సంబంధించి ఎల్‌ఓసీ ఇచ్చినప్పటికీ, మిగిలిన పనులు పూర్తిచేయకుండా అధికారులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రజాధనంతో చేపట్టిన పనుల్లో నాణ్యతే లక్ష్యం
ప్రభుత్వ నిధులతో చేపట్టిన విద్యుత్ పనులు నాణ్యతతో, పూర్తిస్థాయిలో జరగాలన్నదే తమ ఉద్దేశమని చింతమల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో చర్చించి, కార్యాలయ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ ఏఈ కోక్య నాయక్ పాల్గొన్నారు.

Tags: