karepalli khammam district

మత్తుకు బానిసైతే భవిష్యత్తు చిత్తే! ఎక్సైజ్ సీఐ పి.లింగా గౌడ్

మత్తుకు బానిసైతే భవిష్యత్తు చిత్తే! ఎక్సైజ్ సీఐ పి.లింగా గౌడ్

By ·

Share this article
మత్తుకు బానిసైతే భవిష్యత్తు చిత్తే!  ఎక్సైజ్ సీఐ పి.లింగా గౌడ్

మత్తుకు బానిసైతే భవిష్యత్తు చిత్తే!

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

లక్ష్యంతోనే ఉన్నత శిఖరాలకు

ఎక్సైజ్ సీఐ పి.లింగా గౌడ్

 

 

టీ మీడియా,అక్టోబర్31,సింగరేణి(కారేపల్లి):క్షణిక ఆనందం కోసం మాదక ద్రవ్యాల జోలికి వెళితే విలువైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకున్నట్లేనని సింగరేణి ఎక్సైజ్ సీఐ పి.లింగా గౌడ్ హెచ్చరించారు.విద్యార్థులు గంజాయి,ఇతర మాదక ద్రవ్యాలు,చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు.ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం సింగరేణి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ లింగా గౌడ్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణ,సత్ప్రవర్తన అలవర్చుకోవాలని సూచించారు.చెడు వ్యసనాలకు ఒక్కసారి బానిసైతే ఆరోగ్యంతో పాటు చదువు,కుటుంబం,భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

 

 

 

ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు పట్టుదలతో చదవాలని సూచించారు.తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల కోసం కాకుండా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఇష్టంతో,బాధ్యతతో విద్యనభ్యసించాలన్నారు.మంచి విద్య,క్రమశిక్షణ,సత్ప్రవర్తనే విద్యార్థుల విజయానికి బలమైన పునాదులని పేర్కొన్నారు.మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు వాటి వల్ల కలిగే అనర్థాలపై తోటి విద్యార్థులు,యువతకు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎన్.విజయకుమారి,మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.సురేష్,అధ్యాపకులు,ఎక్సైజ్ శాఖ సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.