Telangana

Murder committed due to inability to endure sexual harassment A new dimension in the Shivasattu Sudhakar Swamy case

Murder committed due to inability to endure sexual harassment A new dimension in the Shivasattu Sudhakar Swamy case

By ·

Share this article
Murder committed due to inability to endure sexual harassment  A new dimension in the Shivasattu Sudhakar Swamy case

 

 

లైంగిక వేధింపులు భరించలేకే హత్య​                                                                                                               

శివసత్తు సుధాకర్​ స్వామి కేసులో కొత్త కోణం
 
 
 టీ మీడియా, నవంబరు 4, యాదాద్రి భువనగిరి  : యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్​ మండలంలో శివసత్తు హత్య కేసు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శివసత్తు సుధాకర్​ మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువకుడిని తరచూ లైంగికంగా వేధించేవాడని తేలింది. అది భరించలేకే ఆ యువకుడు తన స్నేహితుడి సాయంతో హత్యకు పాల్పడినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ అక్షాంశ్ ​యాదవ్​ తెలిపారు.

పూజలు, కొలుపులు చెప్తూ జీవనం
రాళ్లబండి సుధాకర్​ స్వామి చౌటుప్పల్​లో నివాసం ఉండేవారు. అతను శివసత్తుగా ఉంటూ దేవుడి పండుగలు, కొలుపులు చెప్పి వ్యక్తిగత పూజలు చేసేవాడు. వీటికి రూ.1 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకునేవాడు. అతనికి వివాహం కాలేదు. కానీ ఓ కుమారుడిని దత్తత తీసుకున్నాడు. ఆ కుమారుడు ఇప్పుడు హైదరాబాద్​లో బీటెక్​ చదువుతున్నాడు. కాగా సుధాకర్​ స్వామి ఆర్థిక వ్యవహారాలన్నీ మేనల్లుడు సురేశ్​ చూసుకుంటున్నాడు. కామాఖ్య అమ్మవారి దర్శనం కోసం సుధాకర్​ అస్సాంలోని దేవాలయానికి తరచూ వెళ్తుండే వాడు. రెండేళ్ల క్రితం అక్కడికి వెళ్లాడు. అప్పుడు మధ్యప్రదేశ్​లోని సోలంగ్​ గ్రామానికి చెందిన పవన్ ​కుమార్ ​(21) సుధాకర్​కు పరిచయమయ్యాడు.

వీడియో బయటపెడతానని బెదిరింపులు
ఆ పరిచయం లైంగిక సంబంధానికి దారి తీసింది. వారిద్దరూ రెండు నెలల క్రితం కలిసిన దృశ్యాలను సుధాకర్ ​స్వామి తన ఫోన్​లో రికార్డు చేశాడు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను కలిసేందుకు తరచూ రావాలని, లేదంటే ఆ దృశ్యాలను బయటపెడతానని సుధాకర్​ స్వామి పవన్​ను బెదిరింపులకు గురి చేశాడు. ఆ వేధింపులను పవన్​కుమార్​ తట్టుకోలేకపోయాడు. కాగా గత నెలలో సురేశ్​కు పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో సుధాకర్​ స్వామి కిలోకు పైగా బంగారు ఆభరణాలను ధరించాడు. ఆ వివాహానికి హాజరైన పవన్​, ఆ ఆభరణాలపై కన్నేసి​ అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.

స్నేహితుడు హర్ష్​ సంతోష్​తో కలిసి
సుధాకర్ ​స్వామిని అడ్డు తప్పిస్తే తన​కు బంగారం దక్కడంతో పాటు వేధింపులు కూడా ఆగిపోతాయని పవన్ అనుకున్నాడు. వెంటనే స్నేహితుడు హర్ష్​ సంతోశ్​​ పాండేను సహాయం కోరాడు. అతను దీనికి ఒప్పుకోవడంతో ఇద్దరూ రైలులో చౌటుప్పల్​కు వచ్చారు. శనివారం రాత్రి సుధాకర్​ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. పథకం ప్రకారం వారు సుధాకర్​ కాళ్లు, చేతులను కట్టేసి కత్తులతో పొడిచి చంపేశారు. తర్వాత 1.319 కిలోల బంగారం, 3.6 కిలోల వెండి, అలాగే రూ.9.03 లక్షల నగదు, ఓ ఐ ఫోన్​ను తీసుకుని సుధాకర్​ కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు.

ఫాస్టాగ్​ సందేశాల ఆధారంతో
మేనల్లుడు సురేశ్​ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అయితే నిందితులిద్దరూ నాగ్​పూర్​ హైవే (ఎన్​హెచ్​-44)పై వెళ్తున్నట్టు సురేశ్​ ఫోన్​కు ఫాస్టాగ్​ సందేశాలు వచ్చాయి. పోలీసులు వెంటనే టోల్​ప్లాజా అధికారులను, అలాగే స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు.

నిర్మల్​ జిల్లా గంజాల్​ టోల్​ప్లాజా వద్ద నిందితుల కారును అడ్డగించారు. అయినా వారు ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు కారు అద్దాలపై కర్రలతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నిర్మల్​ జిల్లా కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చౌటుప్పల్​ పోలీసులకు అప్పగించారు. చౌటుప్పల్ కోర్టులో న్యాయమూర్తి వారికి రిమాండ్​ విధించారు. దీంతో నిందితులను నల్గొండ జైలుకు తరలించారు.

Tags: