Telangana

Cultivate dryland (rain-fed) crops. AEO Ravinder.

Cultivate dryland (rain-fed) crops. AEO Ravinder.

By ·

Share this article
Cultivate dryland (rain-fed) crops.  AEO Ravinder.

 

ఆరుతడి  పంటలు సాగు  చేయాలి.

ఏ ఈ ఓ.  రవీందర్. 

 


టీ మీడియా ,అక్టోబర్ 31 ,కూసుమంచి : సరిపడ సాగునీరు లేనందున వరి పంటకు ప్రత్యామ్నాయంగా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని కూసుమంచి మండల వ్యవసాయ విస్తరణ అధికారి కె రవీందర్ సూచించారు. శనివారం జీళ్లచెరువు గ్రామపంచాయతీ  కార్యాలయం నందు రైతులతో  కేత్ బచావో అభయాన్ - ఎలినో ఎఫెక్ట్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ రైతులకు నీటి లభ్యతను బట్టి సాగు చేయాల్సిన పంటల వివరాలను తెలియజేశారు. ఆరుతడి పంటలైన    పెసర, మినుము, నువ్వులు, కుసుమ, జొన్న, కూరగాయ పంటల సాగు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ, గ్రామపంచాయతీ  కార్యదర్శి రాజేష్, జి పి ఓ శ్రీనివాస్,  రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: