Telangana

Indiramma’s ideals are the inspiration for governance by the people.

Indiramma’s ideals are the inspiration for governance by the people.

By ·

Share this article
Indiramma’s ideals  are the inspiration for governance by the people.

 

 

ఇందిరమ్మ  ఆశయాలే 

ప్రజా  పాలనకు  స్ఫూర్తి.

 


టీ మీడియా ,నవంబర్ 19, కూసుమంచి : భారత తొలి మహిళ మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న , స్వర్గీయ ఇందిరా గాంధీ ఆశయాలే తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలనకు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి తో కలిసి, ఇంచార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం కీర్తిశేషులు ఇందిరా గాంధీ 
జయంతి వేడుకలను కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
 కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బజ్జూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత, పేదల సంక్షేమం కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలను  స్మరించారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బ్యాంకుల జాతీయకరణ, భూ సంస్కరణల చట్టం ప్రవేశపెట్టి పేద ప్రజల అభ్యున్నతి కోసం  నిరంతరం కృషిచేసిన మహనీయురాలు స్వర్గీయ ఇందిరాగాంధీని వారు కొనియాడారు.  ఇందిరా గాంధీ అనుసరించిన ప్రజా సంక్షేమ విధానాలు, దేశాభివృద్ధి కోసం చేసిన కృషి నేటికీ భారతదేశానికి స్ఫూర్తిదాయకమని, ఇందిరాగాంధీ ఆశయాలే ఆదర్శంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగుతూ కృషి చేయాలని క్యాంపు కార్యాలయం ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, చాట్ల పరశురాం, గుండా దామోదర్ రెడ్డి, సర్పంచులు బానోతు నాగేశ్వరరావు, హలావత్తు వీరయ్య, అజ్మీర హీరమాన్ తండా గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజ్మీర జాను నాయక్, కూసుమంచి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు అంతోటి వెంకన్న, నాయకులు బెల్లంకొండ కిరణ్, కందుల వెంకన్న, గుండా భూపాల్ రెడ్డి, మీరా సాహెబ్, తైదల వీరస్వామి, బన్నీ, చంద్రయ్య, సత్యనారాయణ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

Tags: