అల్లం నారాయణ కుటుంబాన్ని
పరామర్శించిన మాజీ ఎం పీ పీ, సి డి సి
మాజీ చైర్మన్ : జూకూరి.
టీ మీడియా ,నవంబర్ 16, కూసుమంచి : తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాతృమూర్తి కామ్రేడ్ అల్లం బుచ్చమ్మ మృతిచెందగా, ఆ కుటుంబాన్ని కూసుమంచి మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, పాలేరు చెరుకు అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ జూకూరి గోపాల్ రావు సోమవారం పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా, అంతని మండలం, గాజుల పల్లె గ్రామంలో జరిగిన నారాయణ తల్లి కామ్రేడ్ అల్లం బుచ్చమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై, బుచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామ్రేడ్ అల్లం బుచ్చమ్మ మృతి పట్ల సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు జూకూరి గోపాలరావు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలం
గట్టు సింగారం గ్రామ మాజీ సర్పంచ్ చాట్ల పరుశురాం, కీర్తిశేషులు అల్లం బుచ్చమ్మ బంధువులు రాజారావు టీచర్, డాక్టర్ దేవరగట్ల లక్ష్మయ్య, అల్లం నారాయణ సోదరులు అల్లం వీరయ్య, అల్లం రాజయ్య, తదితరులు పాల్గొని నివాళులర్పించి, సంతాపం తెలిపి, సానుభూతి ప్రకటించారు.






