ఢిల్లీ

If your name is not in the draft list, you can submit Form 6 again – Election Commission clarifies following concerns from voters.

If your name is not in the draft list, you can submit Form 6 again – Election Commission clarifies following concerns from voters.

By ·

Share this article
If your name is not in the draft list, you can submit Form 6 again – Election Commission clarifies following concerns from voters.

 

ముసాయిదా లిస్ట్‌లో పేరు లేకుంటే మళ్లీ ఫారం                                                                    

 6 ఇవ్వొచ్చు- ఓటర్ల ఆందోళనలపై ఈసీ క్లారిటీ!
 
 
టీ మీడియా, నవంబరు 4, ఢిల్లీ బ్యూరో :  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  ముసాయిదా లిస్టులో పేర్లు కనిపించని ఓటర్ల ఆందోళనలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. గతంలో ఓటు హక్కు ఉండి, ప్రస్తుత ముసాయిదా జాబితాలో పేర్లు లేని పౌరులు- ఓటర్ల జాబితాలో తమ పేరును తిరిగి చేర్చుకోవడానికి నిరభ్యంతరంగా ఫారం- 6 సమర్పించవచ్చని స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు హక్కును కోల్పోయిన వారిలో ఇటీవల కొన్ని భయాలు నెలకొన్నాయి. ఎందుకంటే మళ్లీ కొత్తగా నమోదు చేసుకునేటప్పుడు వాడే ఫారం- 6 లో 'నేను మొదటిసారి ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటున్నాను' అనే ఒక డిక్లరేషన్‌ ఉంటుంది. అందుకే ఇప్పటికే ఓటు హక్కు ఉండి, సర్ జాబితా నుంచి తొలగింపునకు గురైన వారు ఈ ఫారం సమర్పిస్తే- అది చట్ట ప్రకారం తప్పుడు ప్రకటన చేసినట్లు అవుతుందని, దానివల్ల ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద తమపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓటర్లు ఆందోళన చెందారు.

ఇలా ఓటర్లలో నెలకొన్న సందేహాలు, ఆందోళనల నేపథ్యంలోనే ఎన్నికల సంఘం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. సర్‌లో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని పౌరులు- డిక్లరేషన్ కారణంగా ఫారం-6 సమర్పించడానికి వెనుకాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అలాంటి ఓటర్లు ఎవరూ భయపడాల్సిన పని లేదని, వారంతా నిరభ్యంతరంగా తమ పేరును మళ్లీ చేర్చుకోవడం కోసం ఫారం- 6 సమర్పించవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

అలా చర్యలు తీసుకోలేరు!
ఫారం- 6 ఇచ్చినంత మాత్రాన తప్పుడు ప్రకటన చేసినట్లు పరిగణించరాదని, ఈ కారణంతోనే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోలేరని వెల్లడించింది. అయితే సంబంధిత ఓటరు ఇప్పటికే మరో చోట ఓటరుగా నమోదై ఉండటం లేదా చట్టవిరుద్ధమైన, తప్పుడు హామీ పత్రం ఇవ్వడం వంటి సందర్భాల్లో చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ అంశంపై అక్టోబర్ 14న దిల్లీ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పును కూడా ఎన్నికల సంఘం ఈ సందర్బంగా ప్రస్తావించింది. తాము తప్పుడు ప్రకటన చేస్తున్నామంటూ ఓటర్లలో నెలకొన్న సదరు భయాందోళనలు పూర్తిగా నిరాధారమైనవని ఎన్నికల సంఘం దిల్లీ హైకోర్టు తీర్పును ఉటంకించింది. కాబట్టి ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని పాత ఓటర్లు ఎలాంటి భయాలు లేకుండా వెంటనే తమ పరిధిలోని ఈఆర్ఓ కార్యాలయాలు లేదా ఆన్‌లైన్ ద్వారా ఫారం- 6 సమర్పించి ఓటు హక్కును పునరుద్ధరించుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఈసీ వివరణ ఒక మాటల గారడీ- కాంగ్రెస్ ఎద్దేవా
ఓటర్ల నమోదుకు సంబంధించి ఫారం- 6 పై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన తాజా వివరణ కేవలం మాటల గారడీ మాత్రమేనని, దీనివల్ల ఓటర్లకు ఎలాంటి స్పష్టత రాలేదని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సర్ ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఈసీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, అసలు ఈ ప్రక్రియే ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా రూపొందించారని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ విమర్శించారు. ఈసీ వివరణపై స్పందించిన ఆయన, 'ఫారం- 6 లో మొదటిసారిగా ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవాలని దరఖాస్తు చేస్తున్నారా?' అనే ప్రశ్న స్పష్టంగా ఉంటుందని అన్నారు. 'సర్' సమయంలో తిరిగి పేరు చేర్చుకోవాలనుకునే వారిని కూడా తొలిసారి దరఖాస్తు చేసుకుంటున్నవారిగా పరిగణించవచ్చని ఈసీ చెప్పడం మరో రకమైన మాటల గారడీ అని విమర్శలు చేశారు.

Tags: