General

ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు మంత్రి : పొంగులేటిదీపావళి వేడుకలు. 

ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు మంత్రి : పొంగులేటిదీపావళి వేడుకలు. 

By ·

Share this article
ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు   మంత్రి : పొంగులేటిదీపావళి వేడుకలు. 

పేదోళ్ల ఆత్మగౌరవానికి


ప్రతీకగా ఇందిరమ్మ ఇండ్లు


మంత్రి : పొంగులేటిదీపావళి వేడుకలు. 




టీ మీడియా ,నవంబర్ 8, కూసుమంచి:పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రం పాలేరు లో ఆదివారం మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పాల్గొని, లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు.

 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి డివిజన్, వార్డు, గ్రామం, మండలం, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలుకొని వార్డు సభ్యుల వరకు అందరి భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు.

 

 


పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇల్లు ఉండాలనేది ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, పేద ఇంటి ఆడబిడ్డలు కోరుకున్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ. 40,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించామన్నారు. ఇప్పటికే మొదటి విడతలో మంజూరు చేసిన ఇండ్లలో సుమారు 2 లక్షల 21 వేల ఇండ్ల నిర్మాణాలు మంత్రి చెప్పారు.
రాబోయే రోజుల్లో 3వ, 4వ విడతల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లను అందజేస్తామని మంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతo, రాజకీయ పార్టీలకతీతంగా పేదవాడిని అర్హతే ప్రామాణికంగా అందరికీ ఇళ్లు మంజూరు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, రాష్ట్ర ప్రజలందరికీ నా తరఫున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి టీ. సునీల్ రెడ్డి, మండల తహశీల్దార్ సైదులు, ఎంపీడీవో జశ్వంత్ కుమార్, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి, పాలేరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వట్టి శ్రీనివాసు రెడ్డి, పాలేరు గ్రామ సర్పంచ్ బానోతు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ మందడి పద్మ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త పుల్లారెడ్డి, కొత్త విజయ్ పాల్ రెడ్డి, ఎలావుల లింగయ్య, ఎడవెల్లి పుల్లారెడ్డి, ఎడవెల్లి కరుణాకర్ రెడ్డి, బత్తుల ఉప్పయ్య, అద్దంకి చంద్రయ్య, ఎడవెల్లి ఉపేందర్ రెడ్డి, అద్దంకి కోటచారి, శ్రీధర్, అచ్చయ్య, బాలాజీ, నరసయ్య, దోమల వెంకన్న, ఎల్లావుల రవీందర్, నరేష్, వీరస్వామి, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.