anamthapuram

Big update in the case of the attack on a girl in Raptadu.. Hemanth’s health condition is critical.

Big update in the case of the attack on a girl in Raptadu.. Hemanth’s health condition is critical.

By ·

Share this article
Big update in the case of the attack on a girl in Raptadu..  Hemanth’s health condition is critical.

 

 

రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..                                                 

క్రిటికల్‌గా హేమంత్ ఆరోగ్యం
 
 
 టీ మీడియా,నవంబర్14, అనంతపురం  : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన అనంతపురం జిల్లా రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు తెలుస్తోంది. బాలికపై దాడి చేసిన తర్వాత ఆత్మకూరు అడవుల్లోకి వెళ్లి దాక్కున్న హేమంత్‌ను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. అతడు పోలీసులపైనే కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు హేమంత్‌పై కాల్పులు జరపడంతో అతడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స అందించిన వైద్యులు కాలికి తీవ్ర గాయం కావడంతో కుడి కాలును తొలగించారు. అయితే, గత 13 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్ పల్మనరీ ఎంబాలిజం సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రెండు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలోనూ హేమంత్ ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. శుక్రవారం అతడి పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా.. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Tags: