ఆత్మకూర్

The welfare of the poor is the goal of the people's government; pension sanction documents issued to 548 beneficiaries.

The welfare of the poor is the goal of the people's government; pension sanction documents issued to 548 beneficiaries.

By ·

Share this article
The welfare of the poor is the goal of the people's government; pension sanction documents issued to 548 beneficiaries.

 

 

పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం..548 మందికి చేయూత పెన్షన్ పత్రాలు మంజూరు 

 

టీ మీడియా ,నవంబర్ 14 ,ఆత్మకూర్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో కొత్తగా 548 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో కొత్తగా మంజూరైన 548 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ....  గత ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఆత్మకూరు ప్రాంతాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని, ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడా ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేని ఇల్లు ఉండకూడదనే సంకల్పంతో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తూ పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నా.... సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నాయని మంత్రి దుయ్యాబట్టారు. తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
ఆత్మకూరులో ఇప్పటికే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. జూరాల వద్ద కొత్తగా నిర్మిస్తున్న వంతెనను త్వరలో ప్రారంభించి, నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసి రాకపోకలను మరింత సులభతరం చేస్తామని తెలిపారు. పరమేశ్వర చెరువు రహదారిని కూడా వెడల్పు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్లగొండ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు చైర్మన్ రహమతుల్లా, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags: