aswapuram

Bala Sabha (Children’s Assembly) – Raising awareness about children’s rights, education, and health Bala Grama Sabha (Children’s Village Assembly) held under the leadership of Sarpanch Banoth Sadar Lal

Bala Sabha (Children’s Assembly) – Raising awareness about children’s rights, education, and health Bala Grama Sabha (Children’s Village Assembly) held under the leadership of Sarpanch Banoth Sadar Lal

By ·

Share this article
Bala Sabha (Children’s Assembly) – Raising awareness about children’s rights, education, and health  Bala Grama Sabha (Children’s Village Assembly) held under the leadership of Sarpanch Banoth Sadar Lal

 

 

 

  బాల సభ – పిల్లల హక్కులు, విద్య, ఆరోగ్యంపై అవగాహన

 సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఆధ్వర్యంలో బాలల గ్రామ సభ నిర్వహణ

 

 

టీ మీడియా, నవంబర్ 14, అశ్వాపురం: బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం మరియు వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించే లక్ష్యంతో బాలల దినోత్సవం సందర్భంగా అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాల సభను సర్పంచ్ శ్రీ భారత్ సదర్ లాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అధిక సంఖ్యలో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, రక్షణతో పాటు సమాన హక్కులు ఉన్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను బాల సభ ద్వారా గుర్తించి, వాటి పరిష్కారానికి గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఎంపీపీఎస్ స్కూల్‌లో తాగునీటి సమస్య తలెత్తగా వెంటనే స్పందించి హ్యాండ్‌బోర్ మరమ్మతు చేయించడంతో పాటు మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హ్యాండ్‌బోర్ మరమ్మతు సమస్యను కూడా వెంటనే పరిష్కరించినట్లు తెలిపారు.

ఇంకా గ్రామంలోని పిల్లలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా, ఏ అవసరం వచ్చినా గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని సర్పంచ్ సదర్ లాల్ భరోసా ఇచ్చారు. పిల్లల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా గుర్తించి, సంబంధిత అధికారుల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

విద్యార్థులు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని, మీకు ఎల్లవేళలా గ్రామపంచాయతీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, భవిష్యత్తులో దేశ సేవలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాల సభకు హాజరైన చిన్నారులందరికీ బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు, వార్డు సభ్యులు వేములపల్లి హసిత, కనతాల ధనలక్ష్మి, కొరసా ముత్తమ్మ, కుర్సం అనసూయ, పంచాయతీ కార్యదర్శి యాకుబ్, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామంలోని బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.

Tags: