రూ.5 కోట్లతో 46 సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి!
టి మీడియా ఖమ్మం రూరల్ ఏదులాపురం మున్సిపాలిటీ!!

ఏదులాపురం మున్సిపాలిటీ ఆరో వార్డులో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 46 అంతర్గత సిమెంట్ రోడ్ల పనులకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్‌మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మూడు డివిజన్ల పరిధిలో రూ.79.79 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, భవిష్యత్తులో మరో రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి ప్రతి ప్రాంతంలో సిమెంట్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




