జడ్జి కుమారుడి నిర్లక్ష్య డ్రైవింగ్..
ఒకరి దుర్మరణం
టీమీడియా , అక్టోబర్ 26 , కొచ్చి: కేరళలోని కొ చ్చిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 55 ఏండ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జ్యుడీషియల్ అధికారి పేరుపై రిజిస్టర్ అయిన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును ఒక జడ్జి కుమారుడు(17) నిర్లక్ష్యంగా నడుపుతూ, ఒక స్కూటర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆ స్కూటర్ నడుపుతున్న జయ బాలకృష్ణన్(55) అక్కడికక్కడే మృతి చెందాడు.
బాధితుని మేనకోడలు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఫుడ్ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కారు అత్యంత వేగంగా రావడంతో స్కూటర్ తునాతునకలైందని ఆమె తెలిపారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం కూడా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు 17 ఏండ్ల మైనర్ డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని, పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు.
