bhadrachalam

నవ భారత్ హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ మేనేజర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి

తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కన్వీనర్ శనగపాటి మురళీకృష్ణ డిమాండ్

By ·

Share this article
నవ భారత్ హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ మేనేజర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి

నవ భారత్ హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ మేనేజర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి

తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కన్వీనర్ శనగపాటి మురళీకృష్ణ డిమాండ్

  • జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

 


  • ఖమ్మం ,అక్టోబర్ 21:నవ భారత్ హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ కన్వీనర్ శనగపాటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.మొత్తంగా వంట గ్యాస్ అక్రమ విక్రయాలు పెరిగిపోయాయని, ఉమ్మడి జిల్లాలో హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించిన అక్రమాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అక్రమాలకు అడ్డుగా నిలిచినందుకే తనను వేధిస్తున్నారని లక్ష్మీనారాయణ తన చివరి లేఖలో పేర్కొనడం, అక్కడి అక్రమాల తీవ్రతకు నిదర్శనమని అన్నారు. జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరిపై వేధింపులకు సంబంధించిన ఆరోపణలు రావడం బాధాకరమని పేర్కొన్నారు.ముందుగా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి, లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అదే విధంగా గ్యాస్ గోడౌన్‌లో సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయలేదనే అంశంపై సంబంధిత అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘాల నాయకులుగా చలామణి అవుతున్నవారు కూడా ఈ ఘటనపై స్పందించి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.జరిగిన ఘటనకు సంబంధించి అధికారిక వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడికాకముందే సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులు, వ్యాఖ్యలు జర్నలిస్టులందరినీ కించపరిచేలా ఉండటం బాధాకరమని మురళీకృష్ణ అన్నారు. జర్నలిజం ముసుగులో బ్రోకరేజీకి పాల్పడుతున్న కొందరి సంఖ్య ఇటీవల భారీగా పెరిగిందని ఆరోపించారు.

 

 

 


  • డిజిటల్ మీడియా గైడ్‌లైన్స్‌–2021 ప్రకారం అవసరమైన నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతరుల మీడియా లోగోలను ఉపయోగించేవారు, అనుమతులు లేకుండా ఈ-పేపర్లు నిర్వహించేవారు, ప్రింట్ ప్రచురణకు అనుమతి పొంది పీడీఎఫ్ రూపంలో పత్రికలను నడిపేవారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడేవారిని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు.
  •  

  • బాధితులు ఫిర్యాదులు చేయండి
    జర్నలిజం ముసుగులో ఎవరైనా మీడియా పేరు చెప్పి వేధింపులకు పాల్పడితే, వారిపై ఢిల్లీ స్థాయిలోనూ ఫిర్యాదు చేసే అవకాశం ఉందని మురళీకృష్ణ తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు బయటకు వెల్లడికాకుండా విచారణ జరిగే విధానాల గురించి సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని బాధితులు వినియోగించుకోవాలని కోరారు.ప్రతి ఆన్‌లైన్ మీడియా సంస్థ తన స్వీయ నియంత్రణ కమిటీ వివరాలు, ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నంబర్, కార్యాలయ చిరునామా తదితర సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా తన వెబ్‌సైట్‌లో ప్రచురించాలని నిబంధనలు పేర్కొంటున్నాయని తెలిపారు. ఈ అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

 


  • అడగడంలో నిషేధం లేదు.. బెదిరింపులకు పాల్పడకూడదు
    భారతదేశంలో సహాయం, చందా లేదా ఆర్థిక సహకారం కోరడంపై సాధారణంగా నిషేధం లేదని మురళీకృష్ణ పేర్కొన్నారు. పత్రికల నిర్వహణ కోసం ప్రకటనలు అడగడం మాత్రమే బెదిరింపుగా పరిగణించరాదని, అయితే ప్రకటనల పేరుతో ఎవరినీ బెదిరించకూడదని స్పష్టం చేశారు.
    ప్రకటనల కోసం చెల్లింపులు స్వీకరించినప్పుడు చట్టబద్ధమైన రసీదు లేదా బిల్లు ఇవ్వాలని అన్నారు. చెల్లింపు చేసిన వ్యక్తి బిల్లు వద్దని చెప్పినా, వర్తించే చట్టపరమైన నిబంధనలను పాటించడం తప్పనిసరని పేర్కొన్నారు.

 


  • ఈ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు. ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులను ఆశ్రయించి న్యాయం పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు