ఢిల్లీ

Major relief for international students... US court strikes down Trump administration's proposal!

Major relief for international students... US court strikes down Trump administration's proposal!

By ·

Share this article
Major relief for international students...  US court strikes down   Trump administration's proposal!

 

 

విదేశీ విద్యార్థులకు భారీ ఊరట..                                                                   

ట్రంప్‌ సర్కారు ప్రతిపాదనను                                                                     

కొట్టివేసిన అమెరికా కోర్టు!  
  

 

టీమీడియా , నవంబర్ 17, ఢిల్లీ బ్యూరో : అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, విదేశీ జర్నలిస్టుల నివాస గడువుకు పరిమితులు విధించాలని ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను అక్కడి ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది. విద్యార్థుల నివాస కాలపరిమితి నాలుగేళ్లకు పరిమితం చేయడంతోపాటు, ఆ తర్వాత కొనసాగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయాలన్న హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం  ప్రతిపాదన చట్టవిరుద్ధమని తేల్చింది. దీంతో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ విధానం కొనసాగనుంది. ఈ తీర్పుతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు సహా విదేశీ విద్యార్థులకు ఊరట లభించినట్లయింది.

ట్రంప్‌ సర్కారు ప్రతిపాదన ఏమిటంటే?
విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే కాలాన్ని నిర్దిష్ట గడువులకు పరిమితం చేయాలని డి హెచ్ ఎస్ గత జులైలో కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎఫ్‌-1 విద్యార్థి వీసాపై అమెరికాకు వెళ్లేవారు తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు, వీసా నిబంధనలను పాటిస్తూ అక్కడ ఉండే అవకాశం ఉంది. దీన్నే ‘డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌’ విధానం అంటారు. అయితే ఈ విధానాన్ని తొలగించి, అంతర్జాతీయ విద్యార్థుల బసను గరిష్ఠంగా నాలుగేళ్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం భావించింది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే డి హెచ్ ఎస్  నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.

ఈ ప్రతిపాదన ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, బోధకులకు వర్తించే జే-1 వీసాదారులతోపాటు విదేశీ మీడియా ప్రతినిధులనూ లక్ష్యంగా చేసుకుంది. విదేశీ జర్నలిస్టుల బసను 240 రోజులకు పరిమితం చేయాలని, చైనా జర్నలిస్టులకు ఈ గడువును 90 రోజులుగా నిర్ణయించాలని ప్రతిపాదించింది.

విద్యార్థులకు సంబంధించి కూడా పలు మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచించింది. చదువు పూర్తయిన తర్వాత లేదా చదువు అనంతరం ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌   ముగిసిన తర్వాత అమెరికాను విడిచిపెట్టేందుకు ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును 30 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించింది. భాషా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు సెలవులు, విరామ సమయాలతో కలిపి మొత్తం 24 నెలల బస పరిమితి విధించాలని సూచించింది. నాలుగేళ్లలో కోర్సు పూర్తి చేయలేని విద్యార్థులు అదనపు సమయం కోసం ప్రభుత్వ అనుమతి పొందాల్సి వచ్చేది.

ప్రభుత్వానికి విస్తృత అధికారాలు లేవు 
ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలను సవాలు చేస్తూ ఉన్నత విద్యా సంస్థలు, విద్యా సంఘాలు, కార్మిక సంఘాల కూటమి కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మసాచుసెట్స్‌ జిల్లా ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి ఎఫ్‌. డెన్నిస్‌ సేలర్‌ నవంబర్‌ 16న తుది తీర్పు వెలువరించారు.డి హెచ్ ఎస్తీసుకొచ్చిన నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, చట్టానికి అనుగుణంగా లేవని పేర్కొంటూ వాటిని పూర్తిగా రద్దు చేశారు. విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యా అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్‌ ఉద్దేశమని, ఆ అవకాశాలను అడ్డుకునేలా వ్యవహరించేందుకుడి హెచ్ ఎస్ కు విస్తృత అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. వీసా వ్యవస్థలో మోసాలు, జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు తక్కువ భారంతో కూడిన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ఉన్న పర్యవేక్షణ వ్యవస్థలను మెరుగుపరిచే అవకాశాన్ని కూడా డి హెచ్ ఎస్ తగినంతగా పరిశీలించలేదని పేర్కొంది.

సెప్టెంబరులోనే తాత్కాలిక అడ్డుకట్ట
ఈ ప్రతిపాదిత నిబంధనల అమలును న్యాయమూర్తి సేలర్‌ గత సెప్టెంబరులోనే ప్రాథమిక ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు. పాత డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానాన్ని తొలగించి, వీసాదారులకు నిర్దిష్ట కాలపరిమితులు విధించేలా డి హెచ్ ఎస్తీసుకున్న చర్యకు అడ్డుకట్ట వేశారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ఫస్ట్‌ సర్క్యూట్‌ అప్పీళ్ల కోర్టును ఆశ్రయించింది. నవంబర్‌ 3న తుది తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉన్నందున విచారణను 30 రోజుల పాటు వాయిదా వేయాలని కోరింది. తాజాగా ఫెడరల్‌ కోర్టు తుది తీర్పు వెలువరించడంతో ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన గడువు పరిమితులకు అడ్డుకట్ట పడింది. అయితే ప్రభుత్వం ఈ తుది తీర్పును కూడా ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది.

Tags: