Telangana

జై భవానీ యూత్ అన్నదానం

జై భవానీ యూత్ అన్నదానం

By ·

Share this article
జై భవానీ యూత్ అన్నదానం

జై భవానీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం::

టి మీడియా ఖమ్మం రూరల్ అక్టోబర్ 19!!

హనుమంగుడి సెంటర్‌లో ఘనంగా 11వ వార్షికోత్సవ వేడుకలు

 ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామ హనుమంగుడి సెంటర్‌లో జై భవానీ యూత్ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు, స్థానిక ప్రజలకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

 

 


యువత సేవా భావంతో ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

 

 


ఈ కార్యక్రమంలో జై భవానీ యూత్ కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు వల్లపూ జెజికుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పగిళ్ల మహేష్ (చంటి)గ్రామ వి ఓ అధ్యక్షులు వెలుపుల లక్ష్మీ భవానీ కోడె దుర్గా భవానీ కోడె వీరబాబు కమిటీ సభ్యులు, స్థానిక యువకులు, భక్తులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.