khammam

ఆలయ అభివృద్ధికి అండగా  వారధి ఫౌండేషన్.

--25వేలు విరాళం ఇచ్చిన చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య.

By ·

Share this article
ఆలయ అభివృద్ధికి అండగా  వారధి ఫౌండేషన్.

ఆలయ అభివృద్ధికి అండగా  వారధి ఫౌండేషన్.


--25వేలు విరాళం ఇచ్చిన చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య.

 

టీమీడియా, అక్టోబర్ 21 ,  ఖమ్మం:ఖమ్మం నగరంలోని కాల్వోడ్డు ఎఫ్సీఐ  గోడౌన్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అండగా వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య విజయదశమి పర్వదినం రోజు  మంగళవారం 25వేల రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. 
ఆలయ అభివృద్ధి కోసం ఈ 25వేల రూపాయల విరాళాన్ని అందించినట్లు వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య పేర్కొన్నారు. గతంలో మున్నేరుకు వచ్చిన వరదల వలన ఆలయం ముంపుకు గురి కావడంతో ఆలయ మరమ్మత్తులకు  తమ సంస్థ అండగా నిలుస్తున్నదని తెలిపారు.    ఆలయంలో సకల పూజా కార్యక్రమాలు విఘాతం  లేకుండా జరగడానికి తమ వారధి ఫౌండేషన్ ద్వారా 25వేల రూపాయలను ఆలయ అర్చకులు మేడూరి రవికుమార్ కు అందజేశామని తెలిపారు. దైవ కార్యంలో తమ వారధి ఫౌండేషన్ తొలి కార్యక్రమంగా భాగస్వాములు అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. వారధి ఫౌండేషన్ మొదటి సేవా కార్యక్రమాన్ని కలియుగ దైవం  అఖిలాండ బ్రహ్మాండ కోటీ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు.

 

 

 

దైవ సంకల్పంతో తాము నిర్వహిస్తున్న సేవా సంస్థ కార్యక్రమాలు  దిగ్విజయంగా జరగడానికి దీవెనలు అందించాలని ‌ స్వామివారికి మొక్కులు చెల్లించామని తెలిపారు.ఇదేవిధంగా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య తో పాటు వారధి వారధి ఫౌండేషన్ సభ్యులు ఎం సాయి, చిక్కుళ్ల వెంకటేష్,పగిళ్లపల్లి రాజు,నాగరాజు,శివ, ఆలయ అర్చకులు మేడూరి రవికుమార్ , భక్తులు  తదితరులు పాల్గొన్నారు