ఎన్నో ఏండ్ల కల ఈ వైద్య కళాశాల.. మంత్రి కొప్పుల

0
TMedia (Telugu News) :

ఎన్నో ఏండ్ల కల ఈ వైద్య కళాశాల

జగిత్యాల జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసిన‌ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కి కృతజ్ఞతలు తెలిపిన : మంత్రి కొప్పుల

s s consultancy

జగిత్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరింది

టీ–మీడియా ప్రతినిధి (మే 18) జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల,మరియు నర్సింగ్ కళాశాలలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి జగిత్యాల జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాల చిరకాలపు కోరిక నెరవేరిందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు మెడికల్,నర్సింగ్ కాలేజీలు మంజూరు కావడం జరిగింది.సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో కోవిడ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా సంగారెడ్డి,జగిత్యాల,కొత్తగూడెం,వనపర్తి,మంచిర్యాల,మహబూబాబాద్ లలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు.ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కాలేజీలు లేని చోట్ల వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చన నర్సింగ్ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సీఎం సూచించారని మంత్రి ఈశ్వర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.