ముగ్గురు మంత్రులం కలిసి గంట ఏడ్చాం, ఈటల వ్యాఖ్యలు

0
TMedia (Telugu News) :

ముగ్గురు మంత్రులం కలిసి గంట ఏడ్చాం, కేసీఆర్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

టి-మీడియా/హైదరాబాద్(15):

s s consultancy

*టీఆర్ఎస్ అధిష్ఠానంపై ఈటల తీవ్ర అసహనం.
*మీడియాలోనూ తనను బద్నాం చేశారని ఆవేదన.
*ప్రజలు తనవెనకే ఉన్నారన్న ఈటల.

నేనిప్పుడు ఒంటరి అయ్యానని అంటున్నారు. కానే కాదు, నేను బావిలోంచి సముద్రంలో పడ్డట్లయింది. నా నియోజకవర్గంలో అధికారులను బదిలీ చేయించి హడావుడి చేస్తున్నారు.’’ అని ఈటల అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం తనపై వేసిన అభాండాలను ఇప్పుడు యావత్ తెలంగాన ప్రజానీకం వ్యతిరేకిస్తోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన అనుకూల పత్రికల ద్వారా తనపై దుష్ప్రచారం చేశారని, తనను ఒక అపరాధ వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఎన్ని చేసినా ప్రజలు మాత్రం వాటిని నమ్మేస్థితిలో లేరని అన్నారు. శనివారం ఓ ఛానెల్‌కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో టీఆర్ఎస్ అధిష్ఠానం ఎలా వ్యవహరించిందో చెప్పుకొచ్చారు.
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వేరు. ఆనాడు కేసీఆర్ డబ్బును నమ్ముకోలే. అప్పుడు రాష్ట్రం కోసం ఎలాంటి కుట్రలను ఆయన లెక్కచేయలేదు. కానీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని కూడా ప్రగతి భవన్‌కు వెళ్తే వెళ్లగొట్టిన సందర్భాలు ఉన్నాయి”. ఇలాంటివి ఎదురైనప్పుడు గుండెకు గాయమవుతుంది. మేం ప్రజల్లోకి వెళ్లినప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఉన్నవారికి కూడా రైతుబంధు ఎందుకని జనం ప్రశ్నిస్తారు. కానీ, దానికి మాత్రం మాదగ్గర సమాధానం లేదు. ఎప్పుడూ ఎన్నికల ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ చేయొద్దు. ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేయాలి.
ఎంఎల్ఏ పదవి నియోజకవర్గ ప్రజలిచ్చిన భాధ్యత అని కరోనా తగ్గేదాకా రాజీనామా ప్రసక్తే లేదుని,
ఒకసారి తుపాకీ నుంచి గుండు బయటికి వెళ్తే ఎలా మళ్లీ వెనక్కు రాదో ఇప్పుడు కేసీఆర్ పిలిచి సంధి కుదుర్చుకుందామనే ఆఫర్ వస్తే నేను కూడా అంతే. ఇవన్నీ తప్పుడు వార్తలు మాత్రమే. నాలాంటి వాడిని తెలంగాణ ప్రజలు 20 ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్నారు. అంతేకానీ, ఇంకా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదని చాలా మంది అంటున్నారు. నా ఎమ్మెల్యే పదవి హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన భిక్ష. ఇప్పుడు కరోనా తగ్గిపోయేదాకా నేను రాజీనామా చేయను. ఆ తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసే పరిస్థితి వస్తే నేను ఏ పార్టీ నుంచి పోటీ చేయబోను. స్వతంత్రంగా పోటీ చేస్తా. నా నియోజకవర్గంలో నా అనుచరులతో, నాకు సన్నిహితులైన పాత్రికేయులతో చర్చించి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నా.
నాకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు. అందుకే ప్రస్తుతం అందర్నీ కలుస్తున్నా. రేపు నేను ఏ స్థితిలో ఉన్నా వారితో మిత్రుత్వం అంతే కొనసాగిస్తా. గతంలో కూడా వేరే పార్టీలవారితో కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయి. నేనిప్పుడు ఒంటరి అయ్యానని అంటున్నారు. కానీ, నేను బావిలోంచి సముద్రంలో పడ్డట్లయింది. నా నియోజకవర్గంలో అందరు అధికారులను బదిలీ చేయించి హడావుడి చేస్తున్నారు.

మంత్రి వర్గంలో ముగ్గురం మంత్రులం గంట ఏడ్చాం

టీఆర్ఎస్ పార్టీలో
అనేక ఏళ్లుగా అవమానానికి, ఆవేదనకు గురైన వ్యక్తి హరీశ్ రావు. ఇది నిజం మేం మంత్రులమయ్యాక ఓ సారి ప్రగతి భవన్‌లో కిందికి వచ్చి ఏడ్చిన సందర్భం ఉంది. అప్పుడు హరీశ్ రావుతో పాటు నేనూ జగదీశ్ రెడ్డి ఉన్నాం. ఇలాంటి అవమానాలు ఎన్నో ఉన్నాయి.’’ అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.