మాస్క్ ధరించకుంటే చలనాలు, కేసుల నమోదు: ఏసీపీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

టి మీడియా ప్రతినిధి లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా

0
TMedia (Telugu News) :

ప్రభుత్వం లాక్ డౌన్ సడలించిన క్రమంలో జిల్లాలో చాలా మంది మాస్కులు దరించడం లేదని, మాస్కులు ధరించకపోతే జరిమానా తప్పదని మంచిర్యాల ఏసిపి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లక్షెట్టిపేట్ పట్టణం మార్కెట్ ప్రాంతం లో మాస్క్ ధరించిన వారికి అవగాహన కల్పించి వారికి జరిమానా లు విధించడం జరిగింది. ఆర్టిసి బస్ లను ఆపి ప్రయాణికులకు మాస్క్ ధరించడం పై కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. జరిమానా లతోపాటు ఐసొలేషన్ సెంటర్లకు తరలించడం జరుగుతుంది. అని హెచ్చరించడం జరిగింది.

s s consultancy

Also Reead:బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మాటూరి రవీందర్
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ… కరోనా వ్యాప్తి పెరగకుండా పోలీస్ యంత్రాంగం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తున్నదని, ఈ క్రమంలోనే మాస్కులు ధరించకుండా బయటికి వస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కేసులు నమోదు చేయడం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తమ అభిమతం కాదని, కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా కట్టడి చేయడం లక్ష్యంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, ప్రజలు పోలీసులతో సహకరిస్తూ విధిగా మాస్కులు ధరించడం ద్వారా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆయన తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.