అతిగా నీళ్లు తాగితే అనర్థమే

0
TMedia (Telugu News) :

క అయినప్పుడే తాగాలిలెక్కపెట్టుకొని తాగాల్సిన పనిలేదుఅతితో అవయవాలకు ముప్పు.

s s consultancy

.హైదరాబాద్‌

:

అవసరమున్నా  లేకపోయినా నీళ్లు తాగితే మంచి కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి నీళ్లు తాగి పలు అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకొంటున్నారని వారు హెచ్చరిస్తున్నారు. కొంతమంది అలవాటుగా మారి ఎక్కువ నీళ్లు తాగే వారిలో ‘సైకోజనెనిక్‌ పాలిడిప్సియా డిజార్డ్‌’ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో పదేపదే నీళ్లు తాగాలనే ఒక అలవాటును తప్పని సరిగ్గా చేసుకుంటారు. తద్వారా మూత్రం ఎక్కువ విస్తర్జించాల్సి వస్తుంది. దప్పిక ఎప్పుడైతే అప్పుడే నీళ్లు తాగాలి.. లెక్క పెట్టుకొని తాగాల్సిన అవసరం లేదని, ఇది సాధారణ వ్యక్తులకు వర్తించదని వైద్యులు సూచిస్తున్నారు. అతిగా తాగితే అవయవాలకు ముప్పు వాటిల్లుతుందని అపోలో ఆస్పత్రి ఎండోక్రైనాలజలిస్టు డాక్టర్‌ రవిశంకర్‌ ఎరుకులపాటి   హెచ్చరిస్తున్నారు. ఇంకా ఏం చెప్పారంటే..శాస్త్రీయమైన ఆధారం  లేదుఅధికంగా నీళ్లు తాగడం, శరీరంలోని మలినాలను శుద్ధి చేస్తుందని, ముఖానికి మెరుపు వస్తుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారం జరుగుతోంది. అవసరమైన దాని కంటే ఎక్కువగా నీళ్లు తాగాలని కొం దరు సూచిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని నీళ్లు తాగాలి అనేదానికి శాస్త్రీయమైన ఆధారం లేదు. మంచి కంటే శరీరానికి హాని కలిగించవచ్చు.  కేవలం దాహం వేసిప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. ఆరోగ్యవంతమైన శరీరంలో అది సాధారణంగా అంతర్లీనమైనటువంటి శరీర ధర్మం.  జబ్బులుంటే..తరచుగా మూత్రం వెళ్లడం, ఎక్కువ పరిమాణంలో మూత్ర విసర్జన చేయడం వంటి సమస్య ఉందని అనుకుంటే నీళ్లు తాగడంలో వైద్యుల సలహాలు పాటించాలి. హార్మోన్లు, గుండె, మూత్రపిండాలు, మెదడు, కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలున్న వారు కూడా వైద్యులను అడిగి వారు చెప్పిన ప్రకారం నీళ్లు తాగాలి. పరిస్థితులను బట్టిచేసే పనిని బట్టి, ఉండే వాతావరణాన్ని బట్టి నీళ్లు తాగడం అనేది ఉం టుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు, వాతావరణం వేడిగా ఉన్నపుడు, నీళ్ల విరోచనాలు, వాంతులు వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అధికంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అవసరం కంటే అదనంగా నీళ్లు తీసుకోవాలి. కొంతమందికి శరీర బరువును బట్టి నీళ్లు తాగాల్సి ఉంటుంది. క్రీడాకారులు వైద్యుల సలహా ప్రకారం నీళ్లు తాగాలి. పిల్లలు, మతిమరుపు, వృద్ధుల విషయంలో అడిగి నీళ్లు తాగించాలని వైద్యులు పేర్కొంటున్నారు. మూత్రం పోసే సామర్థ్యం కోల్పోయే ముప్పుఅనవసరంగా, అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం తక్కువై పలు సమస్యలకు దారి తీస్తుంది. ఎక్కువ కాలంపాటు ఎక్కువ నీళ్లు తీసుకునే అలవాటు చేసుకుంటే మూత్రపిండాలు మూత్రం పోసే సామర్థ్యం కోల్పోయే ప్రమాదముంది. ఆందోళన, మెదడులో వాపు, మూర్ఛ, మనిషి కోమాలోకి చేరడం, ఎడెమా కారణంగా శరీరం ఉబ్బినట్లు కావచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు.  ఈ పరీక్షలు చేస్తాం..మూత్రం ఎక్కువగా వస్తుందని, నీళ్లు అధికంగా తాగుతున్నామని కొంత మంది ఎండోక్రైనాలజిస్టులను సంప్రదిస్తున్నారు. ఇలాంటి వారికి మధుమేహం, మూత్రపిండాలు, సైకోజనెనిక్‌ పాలిడిప్సియా సమస్యలున్నాయా లేదా అని పరిశీలిస్తాం. కొన్ని రకాల రక్తపరీక్షలు, కాల్షియం, పొటాషియం పరీక్షలు చేసి హెచ్చు తగ్గులను చూస్తాం. ఎలాంటి జబ్బులు లేకపోతే డిప్రవేషన్‌ టెస్ట్‌ చేస్తాం. అతనికి ఏ రకమైన సమస్య ఉంది, ఎలాంటి జబ్బుతో బాధపడుతున్నాడో గమనించి అవసరమైన చికిత్స అందిస్తాం.- డాక్టర్‌ రవిశంకర్‌ ఎరుకులపాటి, ఎండోక్రైనాలజలిస్టు, అపోలో ఆస్పత్రి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.