వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

0
TMedia (Telugu News) :

వ్యవసాయ ప్రణాళికను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి.

  • వానాకాలం సాగు వెబినార్‌లో వక్తల డిమాండ్‌
s s consultancy

వ్యవసాయం పట్ల ప్రభుత్వానికి ప్రణాళిక లేని కారణంగా రైతులు నష్టపోతున్నారని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారానికి చొరవ చూపాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞాప్తి చేశారు.
మంగళవారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయం(ఆర్‌టిసిక్రాస్‌రోడ్స్‌)లో ఆన్‌లైన్‌ ”తెలంగాణలో వానాకాలం సాగు- సమస్యలు” అనే అంశంపై వెబినార్‌ను ఎఐకెఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వానాకాలం పంటలు ప్రారంభం కావడంతో పెట్టుబడి తక్షణ అవసరంగా ఉంటుంది. ఇప్పటికి పాస్‌పుస్తకాలు లేవనే పేరుతో 10 లక్షల మంది పేద రైతులకు రైతు బందు వర్తించడం లేదు. వాస్తవ సాగు అర్హతను రెవెన్యూ వ్యవస్థ ద్వారా గుర్తించి వారికి రైతు బందు ఇవ్వాలి. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు రూ.20,000 కోట్లు ప్రైవేట్‌ వడ్డి వ్యాపారుల వద్ద అధిక వడ్డికి అప్పులు తెచ్చారు. తీర్చలేక అత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నాణ్యతగల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. ఇటీవల 50 క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు పట్టుపడ్డాయి. ప్రతి సంవత్సరం 4 నుండి 5 లక్షల ఎకరాలలో నాణ్యతలేని విత్తనాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. నాణ్యతలేని కాంప్లెక్స్‌ ఎరువులను అమ్మేవారిని శిక్షించాలి. ప్రతి ఎరువుల కంపెనీ నుండి నమూనాలు సేకరించి ప్రభుత్వ ల్యాబ్‌లలో పరిశీలించాలి. క్రిమిసంహారక మందులు, బయోపెస్టిసైడ్స్‌ పేర లక్షల రూపాయలలో మోసాలు జరుగుతున్నాయి. రైతులు మోసపోకుండా వ్యవసాయ శాఖ నిపుణులను కేటాయించి పనికిరాని మందులను అమ్మకుండా చర్యలు చేపట్టాలి. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ ఇచ్చి దానికి ఫిర్యాదు చేయమని, చేసిన ఫిర్యాదును వెంటనే పరిష్కరించే విధంగా సిబ్బందిని నియమించాలి. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులను కదిలించి వాటి పరిష్కారానికి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ.. రైతు బీమా నిబంధనను 18-70 సంవత్సరాలకు పెంచాలి. భూమి సాగుచేస్తున్నవారందరికి వర్తింప చేయాలి. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖను, రెవిన్యూ శాఖలను సమన్వయ పరిచి జాబితాలు తయారు చేయాలి. పంటల బీమాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలి. ప్రకృతి వైపరీత్యాల వలన ప్రతి సంవత్సరం వేల కోట్లలో పంటల నష్టం జరుగుతుంది. పంట చేల నష్టమేకాక మార్కెట్‌ యార్డులోకి వచ్చిన తరువాత కూడా రైతులు నష్టపోతున్నారు. 2015-16లో తప్ప ఏ సంవత్సరం నష్టాలను అంచనా వేయలేదు. ప్రకృతివైపరీత్యాలకు శాశ్వతంగా నష్టాలు జరుగుతున్నట్లు అఖిల భారత పర్యావరణ శాఖ తెలంగాణలో 232 మండలాలను గుర్తించింది. ప్రధానంగా రాళ్ళ వర్షం, సుడిగాలి, తుఫానుల వలన నష్టాలు జరగడమేకాక వర్షాభావంవల్ల కూడా పంటలకు పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి.
మాజీ ఎంఎల్‌ఏ, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహరెడ్డి మాట్లాడుతూ.. అసైన్డ్‌మెంట్‌ పట్టాలు ఇచ్చిన సన్న, చిన్నకారు రైతులకు డిజిటల్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వాలి. వారికి రైతు బందు అమలు చేయాలి. సాదాబైనామలు హైకోర్టు తీర్పు పరిధిలో చేయవలసిన ధరఖాస్తులకు హక్కులు కల్పించి పాస్‌పుస్తకాలు ఇవ్వాలి. పార్ట్‌ బిలోని సమస్యలు రివ్యూ చేయ్యాలి. భూ సర్వే టైంబౌండ్‌ ప్రకారం పూర్తి చేయాలి. హైకోర్టు ఆదేశాల ప్రకారం కలెక్టర్‌ ట్రిబునల్‌లో వున్న పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి
ఈ వెబినార్‌లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, బొంతల చంద్రరెడ్డి, సహాయ కార్యదర్శులు మూడ్‌ శోభన్‌, మాదినేని లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.