సూపర్‌ స్ప్రెడర్లకు కోవిడ్ వాక్సినేషన్ : జిల్లా కలెక్టర్ జి.రవి

0
TMedia (Telugu News) :

సూపర్‌ స్ప్రెడర్లకు కోవిడ్ వాక్సినేషన్ : జిల్లా కలెక్టర్ జి.రవి

s s consultancy

టీ మీడియా ప్రతినిధి,జగిత్యాల జిల్లా, మే 27

చౌక ధరల దుకాణాల డీలర్ లు, వర్కర్ లు,ఎల్పీజీ,పెట్రోల్ బంక్ డీలర్ లు, వర్కర్ లు, ఎరువులు,పంట క్రిమి సంహారక మందుల డీలర్ లు, విత్తనాల డీలర్ లు, వర్కర్ లు, జర్నలిస్ట్ లను కోవిడ్ బారిన పడటానికి,ఇతరులకు వ్యాప్తి చేసేందుకూ ఎక్కువ అవకాశాలున్న ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు.జిల్లాలో వీరికి ఈ నెల 28,29,30 తేదీలలో
కోవిడ్ వాక్సినేషన్ ఇచ్చేందుకు ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.బుధవారం రాత్రి కలెక్టర్ జిల్లాలోని సూపర్‌స్ప్రెడర్ లకు
కోవిడ్ వాక్సినేషన్ ఇచ్చేందుకు నిర్వహించనున్న ప్రత్యేక వాక్సినేషన్ కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ,పౌర సరఫరాలు, సమాచార,పౌర సంబంధాల శాఖ,చౌక ధరల దుకాణాలు,ఎల్పీజీ,ఫర్టి లైజర్ ప్రతినిధుల తో జిల్లా కలెక్టర్ జి.రవి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీరికి తొలుత వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్యం ఆదేశించిన నేపథ్యంలో
ఈ నెల 28,29,30 తేదీలలో ఉదయం 9.30 గంటల నుండి 5 గంటల వరకు ప్రతి మండలంలో ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేస్తామన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా డీలర్,వర్కర్ గుర్తింపు కార్డు,ఆధార్ కార్డు తీసుకెళ్లాలన్నారు.జర్నలిస్టు అయితే ఆధార్ కార్డు తో పాటు అక్రిడేషన్ కార్డు కూడా తమ వెంట తీసుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.