ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్.. శ్రీదేవసెన

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు మరియు ఉపాద్యాయేతర సిబ్బందికి వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్. టీ మీడియా

s s consultancy

హైదరాబాద్ బ్యూరో జూన్ 24.

రాష్ట్రములోని అన్ని జిల్లాలలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది కి ఈనెల 24వ తేదీ గురువారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలలో, స్పెషల్ డ్రైవ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసెన ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం 24వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శ్రీదేవసేన తెలిపారు.
జూలై ఒకటో తేదీ నుండి ప్రత్యక్ష తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన తరుణంలో ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా కరోనా టీకాను వేయించుకోవాలన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఐడెంటిటి కార్డు, ఆధార్ కార్డులను చూపించాలని అమే సూచించారు.
విద్యా మరియు వైద్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి 100% ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఈనెల 30వ తేదీలోగా పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఇతర మేనేజ్మెంట్ ల వారిగా,ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ ప్రత్యేక డ్రైవ్ లో కరోనా టీకాను వేయించుకోవాలని శ్రీదెవసేన ఒక ప్రకటనలో కోరారు.
[10:32, 6/24/2021] శనగపాటి మురళీకృష్ణ: photo
[10:32, 6/24/2021] శనగపాటి మురళీకృష్ణ:

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.