రెండవ వ్యాక్సిన్కి రిజిస్ట్రేషన్ అవసరం లేదు:జిల్లా వైద్యాధికారి

0
TMedia (Telugu News) :

రెండవ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు:జిల్లా వైద్యాధికారి

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి (మే 08)జగిత్యాల జిల్లా:

రాష్ట్రంలో రేపటినుండి కోవిడ్ టీకా 2 వ మోతాదు డ్రైవ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నందు కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ మోతాదుకు అర్హత ఉన్నవారిని కవర్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించబడిందని,రెండవ మోతాదు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్నవారికి ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రాలలో మాత్రమే టీకాలు ఇవ్వబడతాయని జిల్లా వైద్యాధికారి తెలిపారు.రెండవ మోతాదు తీసుకోవడానికి అర్హత కాలం కోవిషీల్డ్‌కు 6 వారాలు మరియు మొదటి మోతాదు తీసుకున్న తేదీ నుండి కోవాక్సిన్‌కు 4 వారాలు అవసరమని,రెండవ మోతాదుకు అర్హత ఉన్న వారందరికీ మొదటి మోతాదుకు వాడిన మొబైల్ నెంబర్ ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవడానికి అనుమతి ఉంటుందని,ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.ఏ వ్యక్తికైనా మొదటి మోతాదుకు వ్యాక్సిన్ ఇవ్వబడదని,పైన తెలిపిన రెండవ మోతాదు వ్యాక్సినేషన్ కార్యక్రమం మే 8 నుండి 12 వరకు వర్తిస్తుందని,ఆదివారం మే 9 రోజున సెలవు దినం కాబట్టి, పైన తెలిపిన సూచనలు పాటిస్తూ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ, సామాజిక మరియు జిల్లా ఆస్పత్రులలో కోవిడ్ టీకా కార్యక్రమం ఉంటుందని అన్నారు. కోవ్యాక్సిన్ లభ్యమయ్యే ప్రాంతాలైన అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఖిల గడ్డ, జగిత్యాల,అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అల్లమల్లయ్య గుట్ట, కోరుట్ల పట్టణంలో లభించునని,అట్లాగే కోవిశీల్డ్ లభ్యమయ్యే ప్రాంతాలు పైన తెలిపిన రెండు సెంటర్లు తప్ప, జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తుందని జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.