అంటువ్యాధులు ప్రబలతాయని ఆందోళన

0
TMedia (Telugu News) :

అంటువ్యాధులు ప్రబలతాయని ఆందోళన

s s consultancy

టి-మీడియా (మే15)ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల

దోర్నాల పాత పోస్టాఫీసు వీదు నందు ప్రధానంగా మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు పైకి మురుగునీరు చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి
అసలే కరోన రెండవ దశ వ్యాప్తి సిమెంటు రోడ్డు మీద మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వ్యాపించడంతో పాటు దోమలకు నిలయంగా మారుతున్నాయి. మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల మలేరియా డేంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది దీంతో అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
దీంతో వర్షాలు కురిసినప్పుడు, కాలువల్లోని వృథానీరుఎక్కడికక్కడి రోడ్డు మీద స్తంభించిపోతోంది
అ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి మురుగు నీరు నిల్వ ఉండకుండా తొలగించి పర్యవేక్షించాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఒక్క సారి పంచాయతీ అధికారులు వచ్చి చూసి వేళ్లారు కానీ ఇప్పటి వరకూ పట్టించుకోవలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు
ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది
ముసలి వాళ్లు వీధి నుంచి నడవడానికి భయంతో అక్కడే ఆగిపోతున్నారు ఆ మురుగు నీటిలో నడిచేటప్పుడు కింద పడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి
కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పటికైనా పంచాయతీ అధికారి స్పందించి రోడ్డు మీద మురుగు నీరు నిల్వ ఉండకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.