ఆక్సిమీటర్స్,ఆక్సిజన్ కాంసెంట్రేటర్లు అందజేత

0
TMedia (Telugu News) :

ధర్మపురి ప్రజలకు వై టీమ్ ఆధ్వర్యంలో పల్స్ ఆక్సిమీటర్స్,ఆక్సిజన్ కాంసెంట్రేటర్లు అందజేత :వై టీమ్ కన్వీనర్ గొల్లపల్లి గణేష్

s s consultancy

టీ–మీడియా ప్రతినిధి (మే 18)జగిత్యాల జిల్లా:

కరోనా మహమ్మారి సృష్టించిన ఇబ్బందుల దృష్ట్యా గత సంవత్సరం మన వై టీమ్ ( వి హెల్ప్ యు) ద్వారా సుమారు 300 కుటుంబాలకు నిత్యావసర సామగ్రి కిట్లు పంపిణీ చేసిన విషయాన్ని తెలిపారు.అయితే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతలో చాలా మంది ఆత్మీయులని కోల్పోతున్నామని,దీనికి చాలా వరకు కారణం భయం కాగా, అవగాహన లోపం,నిర్లక్ష్యాలు, వైద్యులను సంప్రదించి సకాలంలో సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇతర కారణాలు.వైద్యులు కూడా కోవిడ్ వచ్చిన వారు పల్స్ ఆక్సిమీటర్ తో ప్రతిరోజూ ఆక్సిజన్ లెవల్స్ చూసుకుంటూ జాగ్రత్త వహిస్తే ప్రాణాపాయాన్ని తొలగించవచ్చని సూచిస్తున్నారు.అయితే చాలా మందికి ఈ పల్స్ ఆక్సిమీటర్ ల గురించి సరైన అవగాహన లేకపోవడం,పేదరికం కారణంగా వాటిని కొనుక్కోలేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.కాబట్టి ఈ సెకండ్ వేవ్ కోవిడ్ లో వీలైనంత వరకు ప్రాణాపాయం లేకుండా కోవిడ్ నుండి బయట పడటానికి ధర్మపురి ప్రజల సౌకర్యార్థం వై టీమ్ పక్షాన 25 పల్స్ ఆక్సిమీటర్లు అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని అన్నారు. కోవిడ్ వచ్చిన వారు ఐసోలేషన్ కాలం పూర్తి అయ్యేవరకు వీటిని ఉచితంగా వినియోగించుకోవచ్చు.వారి అవసరం తీరిన తర్వాత వాటిని సానిటైజ్ చేసి వేరే వారికి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.ఆక్సీజన్ కాంసెంట్రేటర్స్ కోవిడ్ తగ్గిన వారిలో కొందరికి ఆక్సిజన్ అవసరమైన,ఆక్సిజన్ సకాలంలో దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ ప్రజల సౌకర్యార్థం సుమారు లక్ష రూపాయల విలువ గల రెండు ఆక్సీజన్ కాంసెంట్రేటర్స్ కొని అందుబాటులో ఉంచడం జరుగుతుందని,ఇది పూర్తిగా ఉచిత సేవ అని,ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉంటున్న సోదరులు ప్రణతుల మాధవ్,సంగనభట్ల సుధీర్ ఆర్థిక సహాయం అందజేశారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు.కోవిడ్ వచ్చిన వారు పల్స్ ఆక్సిమీటర్ల కొరకు ఈ నంబర్లను సంప్రదించగలరని,చంటి సోమిశెట్టి 9989495941,
కస్తూరి శరత్ 9542426868,
మణితేజ సంగనభట్ల 8142273234 సంప్రదించగలని అన్నారు.
ఆక్సీజన్ కాంసెంట్రేటర్ కావలసిన వారు ఈ నెంబర్లను సంప్రదించగలరని తెలిపారు.ఈ సదుపాయం 25 మే 2021 నుండి అందుబాటులో ఉంటాయని,ఈ కార్యక్రమం ధర్మపురి పట్టణానికి మాత్రంమే పరిమితం చేస్తున్నామని వై టీమ్ కన్వీనర్ గొల్లపల్లి గణేష్,మధు నరేష్ పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.