రైతులకు సరిపడా సోయా విత్తనాలుఇవ్వడం లేదు-బీఎస్పీ

0
TMedia (Telugu News) :

రైతులకు సరిపడా సోయా విత్తనాలుఇవ్వడం లేదు
–బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్.

s s consultancy

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్

ఈరోజు మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజానిలయంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ గారు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సరిపడా సోయా విత్తనాలు ఇవ్వక ఇబ్బంది పెడుతుందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సోయా లేదా మొక్కజొన్న పంటలను మాత్రమే సాగు చేస్తారని ఒకవైపు మొక్కజొన్న పంటను సాగు చేయవద్దని చెబుతూనే సరిపడా సోయా విత్తనాలు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏముంది అని ఆయన అన్నారు. ప్రభుత్వమే సోయా విత్తనాలు ఇస్తుంది కాదా అని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ మొత్తంలో సోయా విత్తనాలు ఉత్పత్తి చేసుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉన్న విత్తనాలను రెండింతల ధరకు అమ్ముకుంటున్నారని అన్నారు.
చివరికి రైతులే మోసపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వం సోయా విత్తనాలను రైతులకు అందించాలని లేదా మొక్కజొన్న కొనుగోలు చేస్తామని స్పష్టమైన ప్రకటన ఇచ్చి మొక్కజొన్న పంటను సాగు చేసుకోమని రైతులకు సూచించాలని తెలిపారు.
కార్యక్రమంలో సునీల్ సేన సభ్యులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.